జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ త్వరలో రాజధాని ప్రాంతంలో పర్యటించబోతున్నాడు. కొన్నిరోజుల ముందు జనసేన పేరుతో కొందరు రైతులు.. పవన్ ప్రశ్నించాలంటూ నినాదాలు చేసిన తర్వాత పవన్.. ఈ నిర్ణయం తీసుకోవడం విశేషం. వాస్తవానికి జగన్.. ఈనెల 2నే రాజధాని ప్రాంతంలో పర్యటించాల్సి ఉంది.

కేంద్రబడ్జెట్ లో ఆంధ్రాకు అన్యాయం జరిగిన తర్వాత చంద్రబాబుతో భేటీ అయిన పవన్ కల్యాణ్.. ఆ మరుసటి రోజే రాజధాని ప్రాంతంలో పర్యటించాలని ప్లాన్ చేసుకున్నారు. ఈమేరకు ఏర్పాటు కూడా చకచకా సాగిపోయాయి. మీడియాకు లీకులూ వచ్చాయి. అయితే ఈ ప్రాంతంలో జగన్ 3న పర్యటిస్తారని అంతకుముందే డిసైడయ్యింది.

సరిగ్గా పవన్ మార్చి 2 న పర్యటనకు సిద్ధమైన సమయంలో సాక్షి పత్రిక, ఛానెల్ ఆయన రాక జగన్ కు వ్యతిరేకంగానే అనే ప్రచారం ప్రారంభించాయి. 3న జగన్ పర్యటన ఉన్నందువల్ల.. చంద్రబాబే పవన్ ను ప్రోత్సహించి జగన్ కంటే ముందు 2వ తారీఖునే రాజధాని ప్రాంతానికి పంపుతూ కుట్రపన్నారని కథనాలు వెలువరించాయి. సాక్షి టీవీలో అయితే.. ఉదయం నుంచి వ్యతిరేక కథనాలతో విరుచుకుపడింది.

పవన్ కల్యాణ్ చంద్రబాబు కుట్రలో పావుగా మారారని సాక్షి ఛానల్లో ప్రచారం జోరుందుకుంది. సాక్షి ప్రచారానికి తగ్గట్టుగానే.. పవన్ కల్యాణ్ పునరాలోచనలో పడ్డారు. టూర్ ఎందుకు వాయిదా వేసుకున్నారో చెప్పకుండా.. ఈనెల 5 రాజధాని ప్రాంతంలో పర్యటిస్తానని ట్విట్టర్లో ప్రకటించారు. ఈ మార్పుకు జగన్ సొంత మీడియాలో పవన్ కు వ్యతిరేకంగా చేసిన ప్రచారమే కారణమన్న వాదన వినిపిస్తోంది. మరి పవన్ సాక్షి ప్రచారానికి భయపడే వెనక్కి తగ్గారా.. వేరే ఇంకేదైనా కారణముందా.. పవన్ కే తెలియాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: