రాజయ్య ను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికీ.. కేంద్రంలో కవితకు మంత్రి పదవి దక్కడానికీ మధ్య సంబంధం ఉంది.. అని ఎవరైనా అంటే అంత సులభంగా నమ్మలేం. రాజయ్య వ్యవహారానికీ కవితకు సంబంధం ఏమిటి? అని ఎదురు ప్రశ్నిస్తారెవరైనా. అయితే సంబంధం ఉందనేది మాత్రం టీఆర్ఎస్ అంతర్గత వర్గాలు ధ్రువీకరిస్తున్న అంశం

అదెలాగంటే... ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి రాజయ్యను తప్పించి కడియం శ్రీహరిని ఉప ముఖ్యమంత్రిగా చేస్తే ఒక ఎపిసోడ్ ముగుస్తుంది. అప్పుడు తెలంగాణ రాష్ట్ర సమితి ఎంపీల్లో కల్వకుంట్ల కవితకు ఒక అడ్డు తొలగుతుంది. భారతీయ జనతా పార్టీతో చేతులు కలిపి.. కేంద్ర ప్రభుత్వంలో చేరిన తరుణంలో కవితకు మంత్రి పదవి దక్కాలంటే.. కడియం లాంటి వ్యక్తి అడ్డు ఉండకూడదు!

అందుకే ఆయనను కేసీఆర్ తెలివిగా రాష్ట్రానికి తీసుకొచ్చాడట. ఇప్పుడు గనుక భారతీయ జనతా పార్టీతో దోస్తీ కుదిరి టీఆర్ఎస్ వాళ్లు మోడీ మంత్రి వర్గంలో చేరిపోతే.. అప్పుడు కవితకు మంత్రి పదవి ఖాయం అవుతుంది. దక్కే ఒకటీ రెండు మంత్రి పదవులనూ అలా కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఇప్పించవచ్చు. ఒకవేళ ఇప్పుడు గనుక కడియం ఎంపీగా ఉండుంటే.. ఒక సీనియర్ పొలిటీషియన్ గా ఆయన కవితకు అడ్డు అయ్యేవాడు!

అందుకే కేసీఆర్ తెలివిగా ఆయనను కేంద్రం నుంచి రాష్ట్రానికి రప్పించేశాడు. ఇదీ కేసీఆర్ లెక్క. ఈలెక్కను అర్థం చేసుకొంటే.. రాజయ్యను ఉప ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించడానికీ.. కవితకు దక్కబోయే కేంద్ర మంత్రి పదవీకీ మధ్య ఉన్న సంబంధం ఏమిటో సులభంగా అర్థం అవుతుంది!

మరింత సమాచారం తెలుసుకోండి: