తమ పార్టీల తరపున గెలిచిన ఎమ్మెల్యేలు అధికార పార్టీ లో చేరిపోయారని.. అలా పార్టీ ని ఫిరాయించిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ స్పీకర్ ను కోరితే ఆయన చర్యలు తీసుకోవడం లేదని.. ఈ అన్యాయంపై స్పందించాలని కోరుతూ కోర్టుకు ఎక్కిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ, తెలుగుదేశం, కాంగ్రెస్ పార్టీల పిటిషన్ల పట్ల హైకోర్టు బెంచ్ సానుకూలంగా స్పందించింది. ఈ విషయంలో తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, శాసనమమండలి చైర్మన్ లను బాధ్యులుగా చేస్తూ కోర్టు నోటీసులు జారీ చేసింది.

తద్వారా ఈ అంశం గురించి విచారణ మొదలు పెట్టింది. ఇప్పటికే ఒకసారి ఈ పార్టీల పిటిషన్లను హై కోర్టు విచారించింది. సింగిల్ జడ్జి విచారించినప్పడుఉ ఈ పార్టీలకు ఊరట దక్కలేదు. ఈ అంశం గురించి తాము జోక్యం చేసుకోలేమని అంటూ కోర్టు చేతులెత్తేసింది. అయితే ఈ పార్టీలు వెనక్కు తగ్గక ధర్మాసనాన్ని ఆశ్రయించాయి.

ఈ నేపథ్యంలో ధర్మాసనం నుంచి మాత్రం సానుకూల స్పందన వ్యక్తం అయ్యింది. తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ , శాసనమండలి చైర్మన్ లకు నోటీసులు వెళ్లాయి. వారితో పాటు ఫిరాయింపు దారులకు కూడా నోటీసులిచ్చింది కోర్టు.

దీంతో ఇది ఈ మూడు పార్టీల ఉమ్మడి పోరాటానికి దక్కిన ప్రతిఫలం అనుకోవచ్చు. మరి ఈ పిటిషన్ల విచారణ వేగంతం అయ్యి.. స్పీకర్ పై కూడా ఒత్తిడి పెరిగి .. ఫిరాయింపుదారులైన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలపై వేటు పడితే అంతకన్నా ఆసక్తికరమైనఅంశం మరోటి ఉండదు. మరి అది జరిగేనా?!

మరింత సమాచారం తెలుసుకోండి: