ప్రముఖ గాయకులు బాలసుబ్రహ్మణ్యం మాట్లడుతూ ఆయనొక హిమవన్నగం.ఆయన హృదయం అతి మృదు మధురం. ఇట్టే కరిగిపోయే నవనీత మనస్కుడు. పసిపిల్లాడితో సమానం అయితే దీక్ష పడితే మటుకు ఆ హృదయం అత్యంత కఠోరమైనది కూడా. సాధించాలనకుంటే ఎంతటి కఠిన కార్యాన్నయినా ఎదురీది సాధిస్తారు.

డెబ్బయి రోజులలో 50 వేల కిలోమీటర్లు నడిచి ప్రసంగాలు చేసిన ప్రజలను మెప్పించిన ఘన చరిత్ర కలిగిన వ్యక్తి ఒక్క యన్.టి.ఆర్. మాత్రమే. నటనలో ఆయన సవ్యసాచి, పౌరాణిక, జానపద, సాంఘీక చిత్రాలు అలవోకగా నటిస్తూ ఇటు రాజకీయం రంగంలో కూడా తనకు సాటి ఎవరూ లేరనిపించుకున్నధీశాలి.

వారి ప్రాభవం ఎటువంటిదంటే ఆయనకు పాడిన పాటల వల్ల నాకే ఎక్కవ పేరు వచ్చింది. నాకు కీర్తి గంధం పూసిన నటసార్వభౌముడు నందమూరి. నే చూసిన చిత్రాల్లో నాకు నచ్చింది మరుపు రానిది రసానుభూతిని కలిగించింది ‘శ్రీనాధ కవిసార్వభౌములు’ బాపు-రమణ చెక్కిన ఆ కళాఖండంలో రామారావుగారు అభినయం వర్ణింపరానిది.

గాయకునిగా నా అనుభవాన్ని పురస్కరించుకొని అనగలిగే మాట శ్రీ రామారావు గారు ధరించిన ఉదాత్త గంభీర పాత్రతలు, ఆవేశ పూరితమూ, గంభీరము గాఢమైన నటన తెలుగు చలన చిత్రాలు రసిక లోకాన్ని ఆనంద పరిచాయి. నిజమైన నటనకు పర్యాయ పధం లాంటి వారు. నటనకు పెద్ద డిక్షనరీ లాంటి వారు నందమూరి తారక రామారావు గారు.

మరింత సమాచారం తెలుసుకోండి: