తెలుగుదేశం అధ్యక్షుడు చంద్రబాబుపై ధ్వజమెత్తారు కమలనాథులు. ఏపీలో రైతు ఆత్మహత్యల వ్యవహారం గురించి వారు ఘాటుగా స్పందించారు. రాష్ట్ర ప్రభుత్వ అసమర్థత వల్లనే రైతు ఆత్మహత్యలు నమోదవుతున్నాయని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర స్థాయి నేతలు వ్యాఖ్యానించారు. మరి ఒకవైపు ఏపీ ప్రభుత్వంలో భాగస్వామిగా ఉన్న భారతీయ జనతా పార్టీ ఇలాంటి విమర్శలు చేయడం ఆసక్తికరమైన విషయమే.

ఇటీవల తెలుగుదేశం అధ్యక్షుడు, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కేంద్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డాడు. నిధులు కేటాయింపులో అన్యాయం జరుగుతోందంటూ ధ్వజమెత్తాడు. ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక స్థితిని పరిగణనలోకి తీసుకొని కూడా కేంద్రం న్యాయం చేయడం లేదని అసంతృప్తి వ్యక్తం చేశాడు.

ఇలాంటి నేపథ్యంలో ఏపీలో రైతుల ఆత్మహత్యల అంశం గురించి భారతీయ జనతా పార్టీ ఇలా స్పందించడం ఆసక్తికరంగా ఉంది. ప్రభుత్వ అసమర్థత వల్లనే రైతుల ఆత్మహత్యలు జరుగుతున్నాయని కమలనాథులు అంటున్నారు. మరి అదే ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ కూడా భాగస్వామిగా ఉంది.

మరి ఒకవైపు మిత్రపక్షాలుగా, ప్రభుత్వాల్లో భాగస్వాములుగా ఉన్న భారతీయ జనతా పార్టీ.. తెలుగుదేశం పార్టీలు ఇలాంటి విమర్శలు చేసుకోవడం ఆసక్తికరంగా ఉంది. మరి వీరు ఇంతటితో వెనక్కు తగ్గుతారా.. లేక ఇకపై మరింత తీవ్రస్థాయిలో ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకొంటారా? అనే అంశం ఇప్పుడు ఆసక్తికరంగా మారుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి: