కేవలం తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరడం మాత్రమే కాదు... ఆ పార్టీ అధినేత కేసీఆర్ తనకు పదవి ఇచ్చినందుకు గానూ ఆయనపై విధేయతను చాటుకొంటున్నాడు తుమ్మల నాగేశ్వరరావు. ఈ మేరకు ఆయన బాబుపై విరుచుకుపడుతూ కేసీఆర్ ను గొప్పవాడిగా చూపే ప్రయత్నం చేస్తున్నాడు.

ఇటీవల తెలుగుదేశం నేతలు కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. యథావిధిగా కేసీఆర్ బాబు దయవల్ల రాజకీయంగా ఎదిగాడనే విమర్శలు చేశారు. ఈ విమర్శలను తిప్పి కొట్టే బాధ్యతలను తీసుకొన్నాడు తుమ్మల. తెలంగాణ రాష్ట్ర సమితిలో చేరాకా ఆయన కేసీఆర్ పై విధేయతను చూపడానికి ఈ అవకాశాన్ని వినియోగించుకొన్నాడు.

కేసీఆర్ చంద్రబాబు దయవల్ల రాజకీయంగా ఎదగడం కాదు.. కేసీఆరే తెలుగుదేశం పార్టీలో చంద్రబాబు కన్నా సీనియర్ అని.. చంద్రబాబు రాజకీయ ఓనమాలు దిద్దిందే కేసీఆర్ వద్ద అని తుమ్మల అంటున్నాడు. ఈ మేరకు ఈయన తెలుగుదేశం నేతల విమర్శలకు ప్రతి విమర్శలు చేశాడు.

ఎన్టీఆర్ పార్టీ పెట్టే సమమానికి చంద్రబాబు కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడని.. కేసీఆర్ తెలుగుదేశం పార్టీలో నాయకుడిగా ఎదిగాకే చంద్రబాబు ఆ పార్టీలో వచ్చి చేరాడని తుమ్మల గుర్తు చేశాడు. అలా కేసీఆర్ ఒక టీచర్ స్థాయి కి ఎదిగాకా బాబు తెలుగుదేశంలో చేరాడని.. కేసీఆర్ వద్ద పాఠాలు నేర్చుకొన్నాడని తెలుగుదేశం నేతలు గుర్తుంచుకోవాలని తుమ్మల చెబుతున్నాడు. మరి ఒకప్పుడు బాబుకుఅత్యం సన్నిహితుడిగా పేరున్న తుమ్మల ఇలా మాట్లాడటం నిజంగా విశేషమే కదా!

మరింత సమాచారం తెలుసుకోండి: