ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని ఏర్పాటవబోతున్న ప్రాంతాల్లో పర్యటించి ల్యాండ్ పూలింగ్ కింద భూములు కోల్పోతున్న రైతులతో మాట్లాడిన పవన్ కళ్యాణ్ ఎవరూ బలవంతంగా భూములు ఇవ్వాల్సిన అవసరం లేదని ధైర్యం చెప్పారు.

గుంటూరు జిల్లా తుళ్లూరులో రైతులతో జరిగిన సమావేశంలో పవన్ కాస్త ఆవేశంగా ప్రసంగించారు. రైతుల నుంచి బలవంతంగా భూముల్ని సేకరించకుండా స్వచ్ఛందంగా ముందుకొచ్చే వారి నుంచే తీసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు.

కాదుకూడదని రైతులకు వ్యతిరేకంగా ముందుకెళ్తే... వారి తరపున ఆమరణదీక్షకైనా తాను సిద్ధమేనని స్పష్టం చేశారు.అయితే, పనిలో పనిగా అదే వేదికపైనుంచి తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌పైనా ఆయన విమర్శలు గుప్పించారాయన.

రాష్ర్ట విభజన, ప్రాంతీయ విభేదాల నేపథ్యంలో.. '' పదే పదే నువ్వు ఆంధ్రా కొడుకువి, ఆంధ్రా కొడుకువి '' అని కేసీఆర్ అన్నప్పుడు తనకు కూడా బాధేసిందని ఆవేదన వ్యక్తంచేశారు. ఆంధ్రావారిని వేరుగా చూస్తూ మాట్లాడటం బాధాకరం అంటూ తనదైన స్టైల్లో కేసీఆర్‌ని విమర్శించారు పవన్.

మరింత సమాచారం తెలుసుకోండి: