ఏపీ రాజధాని ప్రాంతంలో పర్యటిస్తున్న పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కౌంటర్ ఇచ్చారు. ప్రజల భవిష్యత్తు మేరకే రాజధాని నిర్మిస్తున్నామని, ఈ విషయంలో భూములిచ్చేందుకు రైతులు స్వచ్ఛందంగా ముందుకొచ్చారన్నారు.

రాజధాని అంటే నాలుగు బిల్డింగులు కాదని అన్నారు. రాజధానికి వెయ్యి ఎకరాలు చాలని వామపక్షాలు చెబుతున్నాయని.. అయితే ఆ పార్టీల కార్యాలయాలకు మాత్రం పది ఎకరాలు కావాలా అని ఆయన ప్రశ్నించారు.

రాజధానిని ఎన్ని ఎకరాల్లో కావాలంటే అన్ని ఎకరాల్లో కట్టుకోవచ్చని ముఖ్యమంత్రి తెలిపారు. ఏ విషయంలోనైనా రాజకీయ నాయకులకు దూరదృష్టి వుండాలని అంటూనే, భూసమీకరణపై పవన్ కల్యాణ్ వ్యాఖ్యల గురించి తనకు తెలీదని పేర్కొన్నారు.

రాజధానికి 33 వేల ఎకరాలు అవసరమా అని పవన్‌కల్యాణ్ ఏ సందర్భంలో అన్నారో తెలీదన్నారు. ఏపీలో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొస్తున్నారని వెల్లడించారు. జూన్‌లో రాజధానికి సంబంధించిన మాస్టర్ ప్లాన్ అందుతుందని, నిర్మాణానికి సింగపూర్, జపాన్‌లు సహకారం అందిస్తాయని చెప్పుకొచ్చారు.

మరింత సమాచారం తెలుసుకోండి: