ఆంధ్రా రాజధాని ప్రాంతం ఇప్పుడు ఒక్కసారిగా వేడెక్కింది. ఈనెల 3న ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతంలో పర్యటించాడు. సర్కారు భూదాహాన్ని తీవ్రంగా ఎండగట్టాడు. రైతులు భయపడవద్దని తాను అండగా ఉంటానని భరోసా ఇచ్చాడు.

ఇప్పుడు సీన్ లోకి పవన్ కల్యాణ్ ఎంటరయ్యాడు. డేట్ మారింది... వారం మారింది...కానీ దాదాపు సేమ్ టు సేమ్ జగన్ డైలాగులే ఈయనా రిపీట్ చేశాడు. పవన్ కల్యాణ్ మాటలు లైవ్ లో విన్నవారు ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. రెండు రోజుల క్రితం జగన్ నోట్లో నుంచి వచ్చిన మాటలు పవన్ నోట వినిపించడంతో షాక్ అయ్యారు.

జగన్ రాజధానికి ఇంత రాజధాని అవసరమా అన్నాడు.. పవన్ కల్యాణూ అదే చెప్పాడు.. జగన్ నేనుండగా మీ భూములు ఎవరూ లాక్కోలేరన్నాడు.. పవన్ కూడా మీకు చివరి వరకూ అండగా ఉంటానన్నాడు. అవసరమైతే ఆమరణ దీక్షకు కూడా సిద్ధమన్నాడు. సర్కారు రైతుల భూములతో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తోందని జగన్ చెప్పాడు. పవన్ కూడా ఇంచుమించు అదే అర్థం వచ్చేలా.. ప్రభుత్వం ప్రజల భూములను సద్వినియోగం చేయాలన్నాడు.

ఇంచుమించు ఒకేలా సాగిన ఈ రెండు పర్యటనలు చూస్తే.. పవన్, జగన్ ఒక్కటయ్యారేమో అనిపించేలా ఉంది. ఇన్నాళ్లూ టీడీపీకి అనుకూలంగా ఉంటూ వచ్చిన పవన్ ఒక్కసారిగా స్టాండ్ ఎందుకు మార్చారు. పవన్ జగన్ తో కుమ్మక్కయ్యారా.. పవన్, జగన్ చేతులు కలపనున్నారా.. ఈ ఇద్దరినీ బీజేపీ వెనుకనుంచి నడిపిస్తుందా.. స్కెచ్ ఢిల్లీ నుంచి వచ్చిందా.. అన్న అనుమానాలు కలుగుతున్నాయి. వీటికి మరి కాలమే సమాధానం చెబుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: