సీబీఐకీ.. జగన్ పార్టీకి ఎంతో అవినాభావ సంబంధం ఉంది. వైసీపీలోని చాలామంది నేతలకు సీబీఐ విచారణకు హాజరైన అనుభవం ఉంది. సాక్షాత్తూ ఆ పార్టీ అధినేత వైఎస్ జగనే.. సీబీఐ విచారణ ఎదుర్కొని కొన్నాళ్లపాటు జైలు జీవితం కూడా అనుభవించారు. విజయసాయిరెడ్డి వంటి కీలక నేతలకూ సీబీఐతో మంచి అనుబంధమే ఉంది.

ఇప్పుడు మరో వైసీపీ నేత సీబీఐ కేసులో ఇరుక్కున్నారు. ఐతే ఇది జగన్ కు సంబంధించిన వ్యవహారం కాదు. మాజీ మంత్రి, వైసీపీ పశ్చిమగోదావరి జిల్లా నేత కొత్తపల్లి సుబ్బారాయుడిపై సీబీఐ కేసు నమోదు చేసింది. నకిలీ పత్రాలు సమర్పించి బ్యాంకు రుణాలు తీసుకున్నారన్నది ఈయనపై సీబీఐ మోపిన ప్రధాన అభియోగం.

పశ్చిమగోదావరిలోని 22 చెరువుల పేరుతో కొత్తపల్లి సుబ్బారాయుడు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియాలో ఐదున్నర కోట్ల వరకూ రుణం తీసుకున్నారట. అయితే ఆయన నేరుగా తీసుకోకుండా మిత్రుల పేరుతో రుణం పొందారు. అందుకు సంబంధించిన అన్నీ నకిలీ పత్రాలే సమర్పించారట. ఒక్క కొత్తపల్లిపైనే కాకుండా ఆయన భార్యపైనా ఈ కేసులో అభియోగాలున్నాయట.

ఇలాంటి భారీ స్కాములు సాధారణంగా బ్యాంకు అధికారుల సహకారం లేకుండా జరగవు. కొత్తపల్లి విషయంలో భీమవరం ఎస్బీఐ మేనేజర్ మూర్తి ఆయనకు బాగా సహకరించాడట. కొత్తపల్లి పెట్టింది నకిలీ పత్రాలను తెలిసినా.. గుడ్డిగా రుణం మంజూరు చేసేశాడట. కొత్తపల్లిదంపతులపై కేసు నమోదు చేసిన సీబీఐ.. హైదరాబాద్. భీమవరం, నరసాపురం, అమలాపురం లలో తనిఖీలు నిర్వహించింది.

మరింత సమాచారం తెలుసుకోండి: