ఆమ్‌ ఆద్మీ పార్టీలో విభేదాలు మరింత ముదిరిపోయాయి. ప్రశాంత్‌ భూషణ్‌, యోగేంద్ర యాదవ్‌లను రాజకీయ వ్యవహారాల కమిటీ (పీఏసీ ) నుంచి తొలగించిన ఉద్దేశం, తీరుపై సీనియర్‌ నేత మయాంక్‌ గాంధీ ధ్వజ మెత్తారు. బుధవారం జరిగిన నేషనల్‌ ఎగ్జిక్యూటివ్‌ సమావేశంలో ఓటింగ్‌కు ఆయన గైర్హాజరయారు. వారిరువురూ స్వచ్ఛందంగా వైదొలగాలని నిర్ణయిం చుకున్నా వారిని తీసివేయాలని మనీష్‌ సిసోడియా ప్రతిపాదించడం తనకు ఆశ్యర్యాన్ని కలిగించిందని, వారికై వారు వెళ్లిపోతానంటే ఈ తీర్మానం ఏమిటని తాను వ్యతిరేకించానని గాంధీ ట్వీట్‌ చేశారు. మహారాష్ట్ర నుంచి గాంధీ పార్టీలో సీనియర్‌ సభ్యుడు. పీఏసీలో వారిరువురూ ఉంటే తాను పనిచేయలేనని ఇంతకు ముందు కేజ్రీవాల్‌ స్పష్టం చేశారని గాంధీ అన్నారు. కేజ్రీవాల్‌పై యాదవ్‌ కుట్ర పన్నుతున్నారని ఆరోపించారని, సాక్ష్యం కూడా సమావేశంలో ప్రవేశపెట్టారని గాంధీ తెలిపారు. కేజ్రీవాల్‌ , యాదవ్‌, ప్రశాంత్‌ మధ్య అపనమ్మకం, విభేదాలు ఉన్నాయని అన్నారు.

వారు పీఏసీలో ఉండేందుకు కేజ్రీవాల్‌ ఇష్టపడడం లేదని యాదవ్‌కు అర్ధమయిందని అన్నారు. పీఏసీ నుంచి బయటకు రావడం ప్రశాంత్‌, యాదవ్‌లకు సంతోషమేనన్నారు. ఢిల్లీలో ప్రచారం సందర్బంగా అభ్యర్ధుల ఎంపికపె ౖతనకు అభ్యంతరాలున్నాయని ప్రశాంత్‌భూషణ్‌ అనేక సార్లు మీడియా సమావేశం నిర్వహిస్తానని బెదిరించారని తెలిపారు. ఆదేశాలను లెక్కచేయకుండా విషయాలు వెెల్లడిస్తే తనపై కూడా చర్య తీసుకుంటానన్నారని, అయినా తాను బ్లాగ్‌లో విషయాలు తెలిపానని, చర్యతీసుకున్నా పరవాలేదని, తనకు నిజాలు కావాలని అన్నారు. సిసోడియా వారిని తొలగించాలని ప్రతిపాదించగానే తాను అవాక్కయా నని గాంధీ తెలిపారు. దీనిని బహిరంగంగానే వ్యతిరే కించానని, పైగా ఈ నిర్ణయం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాలంటీర్ల అభిప్రాయాలకు భిన్నమైదని ఆయన అన్నారు. వారు స్వచ్ఛందంగా వైదొలుగుతామని అంటుండగా ప్రతిపాదించిన ఉద్ధేశం, తీరు సమ్మతం కాదని, కాబట్టి ఈ నిర్ణయాన్ని ఆపేయాలని గాంధీ అన్నారు.

యోగేంద్ర యాదవ్‌ విలేకరులతో మాట్లాడుతూ గాంధీ బ్లాగ్‌పై వ్యాఖ్యానించేందుకు తిరస్కరించారు. పార్టీని వదిలిపెట్టే ఆలోచన లేదని వెల్లడించారు. విశ్వాసంగా ఉండాలని ఆయన అను యాయులకు సూచించారు. స్వరాజ్‌, ప్రజాస్వామ్యం, నీతి, గౌరవం సూత్రాలపై పార్టీలో పనిచేస్తానని స్పష్టం చేశారు. ఏఏపీపై విశ్వాసం కోల్పోయేందుకు ఇది సమయం కాదన్నారు. మయాంక్‌ గాంధీ విలేకరులతో మాట్లాడుతూ తన వ్యాఖ్యలపై పార్టీ చర్యతీసుకుంటుందన్న వాదనలను కొట్టిపారేశారు. దేశానికి సేవ చేసేందుకు తనకు ఏఏపీ ఓ వేదికని తెలిపారు. ఇది తిరుగుబాటు కాదు, కుట్ర కాదు, తానేమీ మీడియాని ఆశ్రయించలేదు, తనకు వ్యతిరేకంగా కొన్ని జరుగుతున్నాయని బ్లాగ్‌లో పేర్కొన్నారు. తన బ్లాగ్‌లో వ్యాఖ్యలు పార్టీ ఆదేశాలపై జరిగిన లీకులేనన్న ఆరోపణలను అన్నా హజారే ఉద్యమంలో కీలక సభ్యుడైన గాంధీ తోసిపుచ్చారు. ప్రపంచ వ్యాప్తంగా వాలంటీర్లను కలిపేందుకు తాను బ్లాగ్‌లను ఉప యోగిస్తానని తెలిపారు.

వ్యక్తి కేంద్రంగానే ఏఏపీ రాజకీయాలు ఏఏపీలో అంతర్గత పోరుపై రాజకీయ పార్టీలు పలు రకాలుగా విమర్శలు చేస్తున్నాయి. ఇదో భిన్నమైన పార్టీ అనుకున్నామని, కాని పార్టీలో వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు నడుస్తున్నాయని విమర్శిస్తున్నారు. ఏఏపీకి పటిష్టమైన పార్టీ రాజ్యాంగం లేదని కాంగ్రెస్‌ అంటుండగా వ్యక్తి కేంద్రంగా రాజకీయాలు జరుగుతున్నాయని బీజేపీ విమర్శిస్తోంది. వాళ్లు ఏదో చేస్తామని అధికారం లోకి వచ్చారని, కాని ఇపుడు పార్టీ బలహీనమైపోతోందని బీజేపీ ప్రతినిధి జీవీఎల్‌ నరసింహరావు అన్నారు. ఇవన్నీ కేజ్రీవాల్‌ వ్యూహం ప్రకారమే జరుగుతున్నాయని ఏఏపీ మాజీ సభ్యుడు, ప్రస్తుత బీజేపీ నేత షజియా ఇల్మి వ్యాఖ్యానించారు.

మరింత సమాచారం తెలుసుకోండి: