న్యూఢిల్లీ: వివాదాస్పద డాక్యుమెంటరీ 'భారతీయ కూతురు' స్వదేశం, విదేశాల్లో ప్రసారం కాకుండా గట్టి చర్యలు తీసుకుంటామని భారత ప్రభుత్వం పదేపదే చెప్పినా అది యుకెలో ప్రసారమైపోయింది. ప్రభుత్వం తన సర్వశక్తులు ఒడ్డినా, మూడు మంత్రిత్వ శాఖలు ముమ్మర ప్రయత్నాలు చేసినా డాక్యుమెంటరీ యుట్యూబ్‌ లోనూ ప్రత్యక్షమైంది. దీంతో తగిన చర్యలు తీసు కుంటామని ప్రభుత్వం మరోసారి ప్రకటించింది. భారత హోం మంత్రిత్వ శాఖ ఈ డాక్యుమెంటరీ ప్రసారాన్ని నిలిపివేయాలని కోరినా, ఢిల్లీ కోర్టు సైతం తిరిగి మరోసారి ఉత్తర్వులు వచ్చేవరకు ప్రసారం చేయరాదని పేర్కొన్నా బిబిసి పట్టించు కోలేదు. బ్రిటిష్‌ కాలమానం ప్రకారం బుధవారం రాత్రి పదిన్నరకు, భారత కాలమానం ప్రకారం గురువారం తెల్లవారుజామున మూడున్నరకు ఈ డాక్యుమెంటరీ యునైటెడ్‌ కింగ్‌డమ్‌లో ప్రసార మైంది. వాస్తవానికి దీన్ని మార్చి 8న ప్రసారం చేసేందుకు రూపొందించారు.

భారత్‌ వరకు ప్రసారం చేయబోమని బిబిసి ప్రకటించినా విదేశాల్లో మాత్రం ప్రసారాన్ని నిలువరించబోదని తెలుస్తోంది. బ్రిటిష్‌ మీడియా సంస్థపై చర్యలకు అన్ని అవకాశాలను పరిశీలిస్తున్నట్లు హోం మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ గురువారం తెలిపారు. చిత్రాన్ని రూపొందించిన లెస్లీ ఉడ్విన్‌పై సైతం చట్టపరమైన చర్యలు తీసుకునే ఆలోచన ఉన్నదని హోంశాఖ అధికారులు వెల్లడించారు. సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ జాయింట్‌ సెక్రటరీ లేఖకు బుధవారం సమాధానం ఇచ్చిన బిబిసి టెలివిజన్‌ డైరెక్టర్‌ డ్యానీ కోహెన్‌, అత్యంత సునిశితంగా, సుదీ ర్ఘంగా సమాలోచనలు జరిపాక టెలికాస్ట్‌ చేయాలనే నిర్ణయం తీసుకున్నామని తెలిపారు. ఇదిలా ఉండగా తమ కుమార్తె పేరుని ఈ విధంగా ప్రపంచం ముందు పెట్టినందుకు నిర్భయ తల్లిదం డ్రులు బిబిసిపై తీవ్రమైన ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. చట్టపర చర్యలు తీసుకుంటామని హెచ్చ రించారు. తమ కుమార్తె పేరు, ఫొటోను వాడబోమని చెప్పి ఈ విధంగా చేయటం సరికాదన్నారు. ప్రభుత్వం ఈ విషయంలో సుప్రీంకు వెళ్లేందుకు సిద్ధమవటంపై సంతృప్తిని వ్యక్తం చేశారు. ఐక్యరాజ్యసమితి ఖండన

నిర్భయ ఘటన నేరస్తుడు చేసిన వ్యాఖ్యలను ఐక్యరాజ్య సమితి ప్రధాన కార్యదర్శి బాన్‌కీ మూన్‌ అధికార ప్రతినిధి ఖండించారు. మాటల్లో చెప్ప డానికి వీల్లేని అతడి కామెంట్లపై తానేమీ మాట్ల డలేనని, దీనిపై బాన్‌కీమూన్‌ విపులంగా తన అభిప్రాయాలు వెల్లడించారన్నారు.

ప్రసార నిలుపుదలకు పలు అవరోధాలు డాక్యుమెంటరీ ప్రసార నిలుపుదలకు సమా చార ప్రసార, విదేశీ వ్యవహారాలు, సమాచార టెక్నాలజీ మంత్రిత్వ శాఖలు ప్రయత్నాలు చేస్తున్నా ఫలితం కనిపించడం లేదు. బిబిసి, గూగుల్‌తో ఈ మూడు శాఖలు సంప్రదింపులు జరుపుతున్నాయి. డాక్యు మెంటరీలో నిషేధించిన భాగాన్ని మరికొన్ని గంటల్లో కనిపించకుండా చేయగలమని యూట్యూబ్‌ సంస్థకు చెందిన అధికారులు హామీ ఇచ్చారు. డాక్యుమెంటరీని రూపకర్తలు శాంతి భద్రతల భంగం, లేదా మోసానికి పాల్పడ్డారని నిరూపించడం కష్టమని, కింది కోర్టు విధించిన నిషేధాన్ని పైకోర్టు ఎత్తివేసే వీలుందని అరుణ్‌ మోహన్‌ సుకుమార్‌ అనే న్యాయనిపుణుడు తెలిపారు.

మరింత సమాచారం తెలుసుకోండి: