ఇప్పటికే దాదాపు 32 వేల ఎకరాల భూ సేకరణ పూర్తి అయ్యింది. ఇంకా అభ్యంతరాలు తెలుపుతున్న వారినైతే పట్టించుకొనేది లేదు. రాజధాని కోసం భూ సేకరణ విషయంలో ముందుకెళ్లడమే కానీ వెనక్కు తగ్గడం ఉండదు.. భూమలు ఇవ్వడానికి ఇష్టపడని రైతులపై చట్టపరంగా ఒత్తిడి తెచ్చి స్వాదీనం చేసుకొనే ప్రక్రియను అవలభిస్తామని ప్రభుత్వం స్పష్టం చేస్తోంది.

దీంతో భూ సమీకరణ విషయంలో అభ్యంతరం చెబుతున్న పవన్ కల్యాణ్ కు కూడాప్రభుత్వం పెద్దగా విలువనిచ్చేది ఉండదని స్పష్టం అవుతోంది. రైతులు ఇస్తేనే భూమి తీసుకోవాలన్న పవన్ హెచ్చరికను ఏపీ గవర్నమెంటు అస్సలు పట్టించుకోదని కూడా తెలుస్తోంది. రాజధాని విషయంలో తాము అనుకొన్నట్టుగానే ప్రభుత్వం ముందుకెళ్లే అవకాశం ఉందని సమాచారం.

రాజధాని విషయంలో పవన్ బరిలోకి దిగక ముందు నుంచే అభ్యంతరాలు వ్యక్తం అయ్యాయి. చాలా మంది రైతులు హైదరాబాద్ వరకూ వచ్చి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబును కలిశారు... ప్రతిపక్ష నేత జగన్ మోహన్ రెడ్డిని కలిశారు. చంద్రబాబు అయితే రైతులకు స్పష్టం చేశారు.. ఇష్టం ఉన్న లేకపోయినా భూములు ఇవ్వాల్సిందేనని ఆయన తేల్చి చెప్పారు. ఇక జగన్ మోహన్ రెడ్డి రాజధాని ప్రతిపాదిత ప్రాంతానికి కూడా వెళ్లొచ్చాడు.

అయితే అప్పుడంతా ప్రభుత్వం ఆ అభ్యంతరాలను లెక్క చేయలేదు. అదే విధంగా పవన్ అభ్యంతరాలను కూడా లైట్ తీసుకోనుంది ఏపీ ప్రభుత్వం. ఈ విషయాన్ని ఎవరూ అధికారికంగా ప్రకటించకపోయినా.. జరిగేది మాత్రం ఇదే. మరి ఇప్పుడు పవన్ ఏం చేయబోతున్నాడో..!

మరింత సమాచారం తెలుసుకోండి: