తెలంగాణ వస్తే దళితుడిని తమ పార్టీ తరపున ముఖ్యమంత్రిని చేస్తానని ప్రకటించిన కేసీఆర్ తీరా తెలంగాణ వచ్చి అధికారం చేతికి అందాకా మాత్రం మాట మార్చాడు. దళితుడిని కేవలం ఉప ముఖ్యమంత్రి స్థానానికి పరిమితం చేశాడు. అయితే అలా పక్కలో తెచ్చిపెట్టుకొన్న ముఖ్యమంత్రులు కేసీఆర్ ను ముప్పుతిప్పలు పెడుతున్నారు. అందుకే ఇప్పటికే ఒక ఉప ముఖ్యమంత్రిని ఇంటికి పంపించాడు.

రాజయ్యను కాదని కడియం శ్రీహరిని తెచ్చి ఉప ముఖ్యమంత్రిగా నియమించుకొన్నాడు కేసీఆర్. ఇక అంతా సాఫీగాజరిగిపోతుందని అనుకొన్నారు. రాజయ్య తన మాటలతో ఇబ్బంది పెట్టేవాడు.. ఇక కడియం తన మాటే వింటాడని కేసీఆర్ ఆశించాడు. అయితే వాస్తవంలో మాత్రం అలా జరగడం లేదు.

ఇప్పుడు కడియం తన మాటలతో ముఖ్యమంత్రి కేసీఆర్ ను ముప్పతిప్పలు పెట్టడం ప్రారంభించాడు. తను రాజీనామా చేసిన వరంగల్ నియోజకవర్గం ఉప ఎన్నికల విషయంలో ఈయన రన్నింగ్ కామెంట్రీ మొదలు పెట్టాడు. ఇక్కడ పోటీ చేస్తే మాదిగ వ్యక్తే పోటీ చేయాలని ఈయన అంటున్నాడు. అదేంటలా అంటే.. ఈ నియోజకవర్గాన్ని కేసీఆర్ కాంగ్రెస్ నుంచి వచ్చి వివేక్ కు అప్పగించే అవకాశం ఉందని.. ఆ నిర్ణయం నచ్చని కడియం ఇలా మాట్లాడుతున్నాడని వార్తలొస్తున్నాయి.

వివేక్ ను ఇక్కడ నుంచి పోటీ చేయిస్తే.. ఈ నియోజకవర్గాన్ని దళితులకే కేటాయించినట్టు అవుతుంది.. ఒక వ్యాపార వేత్తను పార్టీకి దగ్గరచేసుకొన్నట్టూ అవుతుందని కేసీఆర్ లెక్కలేసుకొంటుంటే.. వివేక్ పొడ గిట్టని కడియం మాత్రం దళితుల్లో కూడా మాదిగలకే ఈ సీటు ఇవ్వాలని అంటున్నాడు. వివేక్ మాల సామాజికవర్గం అవుతాడు కాబట్టి.. కడియం ఈ వాదన వినిపిస్తున్నాడట. దీంతో కేసీఆర్ కు కొత్త ఉప ముఖ్యమంత్రితో పితలాటకం షురూ అయ్యింది. మరి ఆయన దీన్నుంచి ఎలా బయటపడతాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: