పీసీసీ అధ్యక్ష మార్పు లాంఛనంగా పూర్తి అయ్యింది. పొన్నాల స్థానంలో తెరపైకి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అధికారికంగా బాధ్యతలు స్వీకరించాడు. పీసీసీ అధ్యక్ష మార్పు నేపథ్యంలో ఇదే సమయంలో సీఎల్పీ అధ్యక్ష మార్పు కూడా చర్చనీయాంశం అయ్యింది. పొన్నాలను తప్పిస్తున్న తరుణంలో జానాను కూడా తప్పించాలనే డిమాండ్ మళ్లీ హైలెట్ అయ్యింది.

సీఎల్పీ అధ్యక్ష స్థానం నుంచి జానాను తప్పించాలనే డిమాండ్ చాలా పాతదే. అయితే జానా అదృష్టవశాత్తూ పదవిలో కొనసాగుతున్నాడు. అయితే ఇప్పుడు మాత్రం అధిష్టానం ఆయనకు కూడా తీవ్రమైన హెచ్చరికనే జారీ చేసిందట. కేసీఆర్ ప్రభుత్వంపై పోరాట పంథాను ఎంచుకోవాలని స్పష్టం చేసిందని తెలుస్తోంది.

ఒకవేళ ఆ బాటన నడకవపోతే సీఎల్పీ అధ్యక్ష పీఠం నుంచి తప్పించడం ఖాయమని కూడా జానారెడ్డికి ఢిల్లీ నుంచి హెచ్చరికలు వచ్చినట్టుగా తెలుస్తోంది. మరి జానారెడ్డి ఏదో రిటైర్ మెంట్ బెనిఫిట్ కింద సీఎల్పీ అధ్యక్ష పీఠాన్ని పొందినట్టుగా ఫీలవుతున్నాడు. తను గట్టిగా మాట్లాడితే కేసీఆర్ తనకు విలువనివ్వడని కూడా జానారెడ్డి ఇప్పటికే వ్యాఖ్యానించాడు.

ఆ గౌరవాన్ని నిలబెట్టుకోవడానికి అయినా.. తను సైలెంట్ గా ఉండక తప్పదని జానా చెప్పుకొచ్చాడు.అయితే అధిష్టానం మాత్రం ఈ వైఖరిపై అసంతృప్తితో ఉందని తెలుస్తోంది. గౌరవం కావాలో.. పదవి కావాలో తేల్చుకొమ్మని సూచించిందట. మరి ఇంతకీ జానారెడ్డి ఇప్పుడు దేన్ని ఎంపిక చేసుకొంటాడో!

మరింత సమాచారం తెలుసుకోండి: