ఆంధ్ర ముఖ్యమంత్రి చంద్రబాబు తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఒక్కోవర్గం ప్రభుత్వానికి వ్యతిరేకమవుతున్నాయి.చంద్రబాబూ.. రైతులయ్యారు, ఇక మహిళల వంతు ఏపి ముఖ్యమంత్రి తీసుకుంటున్న నిర్ణయాలతో రాష్ట్రంలో ఒక్కోవర్గం ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆందోళన బాట పడుతున్నాయి. భూసేకరణ, సమీకరణ, రుణమాఫీ వ్యవహారాల కారణంగా చంద్రబాబు ప్రతిష్ట రైతుల్లో మసగబారిందన్నది వాస్తవం. డ్వాక్రా రుణాల కారణంగా మహిళలు అసంతృప్తితో వున్నారు.

దీనికి అంగన్ వాడీ ఉద్యోగుల వ్యవహారం తోడవుతోంది. తెలంగాణలో అంగన్ వాడీలకు నెలకు ఏడువేల అయిదువందల రూపాయలు వేతనం ఫిక్స్ చేసారు. ఇది ఒకప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 4,200 రూపాయలు మాత్రమే ఉంది. అంటే తెలంగాణలో దాదాపు వారి వేతనాలు రెట్టింపయ్యాయి. ఏపిలో మాత్రం వారి వేతనాలు పెంచలేదు. బడ్జెట్ సమావేశాల సంధర్భంగా ప్రభుత్వం అంగన్ వాడీల వేతనాల పెంపుపై ఏదో ప్రకటన చేస్తుందని ఆశించినా అదేమి లేకపోవడంతో వైకాపా ఈ విషయమై సభలోనూ, సభ వెలుపలా తీవ్ర స్ధాయిలో విమర్శించింది, ప్రభుత్వంపై ఎదురుదాడి చేసింది.

తాజాగా బయట కాంగ్రెస్, వామపక్షాలు అంగన్ వాడీల వేతనాలు పెంచాలని ఆందోళనను తీవ్రం చేసాయి. హైదరాబాద్ లోని ధర్నాచౌక్ లో వామపక్షాలు, కాంగ్రెస్ లతో పాటు సిఐటియు వంటి కార్మికసంఘాలు, అంగన్ వాడీలు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. ఈ ఆందోళనకు సిపిఐ, సిపిఎం సీనియర్ నేతలు నారాయణ, బివి రాఘవులు, కాంగ్రస్ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య వంటి వారు హాజరై ఇన్నాళ్లు సమాన వేతనం తీసుకుని ఇఫ్పుడు పొరుగున ఉన్న వారి కంటే సగం తక్కువ వేతనం ఎలా తీసుకుంటాం, పని తెలంగాణలోనూ, ఏపిలోనూ అంతే కదా అని నినదించారు. అంతే కాదు చలో అసెంబ్లీకి పిలుపునిచ్చారు. దీంతో ఆంద్రప్రదేశ్ లోని వివిధ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున అంగన్ వాడీలు మంగళవారం ఉదయం నుంచే హైదరాబాద్ చేరుకుంటున్నారు.

అయితే ఏపి నుంచి హైదరాబాద్ కు వచ్చి నగరంలో ఆ బస్సులు ఆగే స్టాపుల్లో, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్లో పెద్ద ఎత్తున పోలీసుబలగాలను మొహారించి ఉదయం నుంచి వారిని అదుపులోకి తీసుకోవడం మొదలుపెట్టారు. కార్యకర్తలను అసెంబ్లీ వైపు వెళ్లకుండా నిరోదిస్తున్నా.. నాయకులను అరెస్టు చేసి పోలీసు స్టేషన్లకు తరలిస్తున్నారు. అయితే వారు అసెంబ్లీ ముట్టడి చేయకుండా నిరోదించినా.. హైదరాబాద్ లో పెద్ద ఎత్తున ఆందోళన మాత్రం చేయనున్నారు. ఈ గొడవ చిలికిచిలికి పెద్దదయ్యే విధంగా ఉంది. అంటే రుణమాఫీ లేక డ్వాక్రా మహిళలు, ఇటు వేతనాలు పెరగక అంగన్ వాడీలకు ప్రభుత్వంపై వ్యతిరేకత పెరిగితే చంద్రబాబు రాజకీయంగాను ఇరుకున పడడం ఖాయం.

మరింత సమాచారం తెలుసుకోండి: