తను చిన్నప్పటి నుంచి ఏ తరగతిలో అయినా ఫస్ట్ క్లాస్ స్టూడెంట్ గా ఉన్నానని విపక్ష నేత జగన్ చెప్పారు.తనపై టిడిపి ఎమ్మెల్యేలు,మంత్రులు పచ్చి అబద్దాలు ప్రచారం చేస్తున్నారని అన్నారు.ఎంత దారుణంగా మాట్లాడుతున్నారంటే, తాను బేగంపేట పబ్లిక్ స్కూల్ లో చదివితే, శివశివానిలో చదివానని చెప్పారన్నారు.

తన తల్లి విజయమ్మ అప్పట్లో రోశయ్యతో తన గురించి బాధపడుతూ చెప్పిందని ప్రచారం చేస్తున్నారని అన్నారు.తాను అప్పటికే బెంగుళూరులో ఉంటే,తనను బెంగుళూరు పంపినట్లు మా అమ్మ చెప్పిందని అంటున్నారని,

తాను 2009 లో తండ్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చనిపోయాక 2010లో హైదరాబాద్ వచ్చానని ఆయన వివరించారు.రోశయ్య తో తన గురించి మాట్లాడడానికి ఆయన ఏమైనా ఆమెకు ఏమైనా పెదనాన్నా,చిన్నాయనా అని జగన్ ప్రశ్నించారు.

నోరు తెరిస్తే టిడిపి నేతలు అబద్దాలు చెబుతున్నారని జగన్ వ్యాఖ్యానించారు. ప్రతిపక్ష నాయకుడు సబ్జెక్టు గురించి మాట్లాడేటప్పుడు స్పీకరే టీడీపీ నాయకుడిలా మీరు మాట్లాడకూడదు అంటే మేం ప్రజాసమస్యల గురించి ఎలా ప్రస్తావించాలి?అని జగన్ పేర్కొన్నారు.తమ సభ్యులను సస్పెండ్ చేయడం కాని,ఇతర అరోపణలు కాని అంతా దుర్భుద్దితోనే చేస్తున్నారని జగన్ వాపోయారు.

మరింత సమాచారం తెలుసుకోండి: