అసెంబ్లీలో తనను మాట్లాడకుండా అడ్డుకుంటుండడంతో వైసీపీ అధినేత జగన్‌ లోటస్‌పాండ్‌లోని తన కార్యాలయంలోనే విలేకరుల సమావేశం పెట్టి మరీ, అసెంబ్లీలో ప్రతిపక్ష నేత చేసే బడ్జెట్‌ ప్రసంగం చేసేశారు. దేశంలోనే ఒక సరికొత్త, విచిత్ర సంప్రదాయానికి శ్రీకారం చుట్టారు. అసెంబ్లీలో చేయాల్సిన ప్రసంగాన్ని విలేకరుల సమావేశం చేయడం ద్వారా, అధికార పక్షానికి కూడా ఆయన ఝలక్‌ ఇచ్చారు. బడ్జెట్‌ ప్రసంగంలో భాగంగా రైతు రుణ మాఫీని ఆయన ప్రధానంగా ప్రశ్నించారు. ఇందుకు ఉదాహరణలు కూడా చూపారు. గణాంకాలను వివరించారు. నిజానికి, రుణ మాఫీ పథకం అమలుపై ప్రభుత్వం చెప్పడానికి ఏమీ ఉండదు. ఒక సందర్భంలో మనం రుణ మాఫీని అమలు చేయడానికి గ్రామాల్లో నోటీసు బోర్డుల మీద ఏయే రైతులకు ఎంతెంత రుణాలను మాఫీ చేశామో పార్టీ తరఫున బోర్డులు రాయిద్దామని టీడీపీ పార్టీ సమావేశంలో ఇటీవల లోకేశ్‌ సూచించారు.

సమావేశంలోనే దానికి తీవ్ర విముఖత వ్యక్తమైంది. ఇందుకు కారణం రుణ మాఫీ పథకాన్ని సమర్థంగా అమలు చేయలేదని, దాని విషయంలో తమపై వ్యతిరేకత పెల్లుబుకుతోందని ప్రభుత్వానికి కూడా స్పష్టం కావడమే. అదే సమయంలో దీనికి సంబంధించి జగన్‌ ప్రశ్నలకు ఎదురు దాడి చేయగలదు తప్పితే దీటుగా జవాబు అయితే చెప్పలేదు. డ్వాక్రా సంఘాల రుణ మాఫీకి సంబంధించి కూడా చంద్రబాబు పదే పదే హామీలు ఇచ్చారు. ఇప్పటి వరకు దానిని అమలు చేయలేదు. దానిని కూడా జగన్‌ ఎత్తి చూపారు. ఈ విషయంలోనూ ఎదురు దాడి తప్పితే జగన్‌కు దీటుగా బదులు చెప్పలేని పరిస్థితి ప్రభుత్వానిది, టీడీపీ నేతలది.

ఇక సాగునీటి రంగానికి వస్తే, పోలవరం ప్రాజెక్టుకు కేంద్రం వంద కోట్లు కేటాయిస్తే, రాష్ట్ర ప్రభుత్వం వెయ్యి కోట్లు కేటాయించిందని బడ్జెట్‌ రోజు గొప్పలు చెప్పుకొన్నారు. వెయ్యి కోట్లలో 775 కోట్లు ఏఐబీపీ నుంచి వస్తాయని పేర్కొన్నారు. అయితే, అందులో వంద కోట్లు మాత్రమే ఇస్తామని తమ బడ్జెట్లో కేంద్రమే పేర్కొంది. అంటే పోలవరానికికేటాయింపులు అరకొరే.

ఒక, గాలేరు, నగరి, హంద్రీనీవా తదితరాలకు కేటాయింపుల విషయంలోనూ జగన్‌ నిలదీశాడు. కేటాయింపులు గణాంక సహితంగా ఉన్నప్పుడు వాటికి ప్రభుత్వం ఏం జవాబు చెబుతుంది. ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ఇటువంటి ఎన్నో అంశాలను జగన్‌ ప్రస్తావించారు. ఈ విషయం ప్రభుత్వానికి కూడా తెలుసు. ఆర్థిక పరిస్థితి కావచ్చు.. కేంద్రం సహకరించకపోవడం కావచ్చు.. మరొకటి కావచ్చు.. ఇప్పటికిప్పుడు వాటిని

మరింత సమాచారం తెలుసుకోండి: