రెండు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన శాసన మండలి ఎన్నికల్లో ఓటర్లు విలక్షణమైన తీర్పునిచ్చారు. ఈ ఎన్నికల్లో నాలుగు ప్రధాన పార్టీలు బలపరిచిన అభ్యర్థు లను గెలిపించి విద్యావంతులు తమ ప్రత్యేకతను చాటుకున్నారు. తెలంగాణాలో జరిగిన పట్టభద్రు ల నియోజకవర్గ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ అభ్యర్థి ఎన్‌.రాంచందర్‌రావు, సమీప తెలంగాణ రాష్ట్ర సమితి అభ్యర్థి దేవీప్రసాద్‌పై 13,318 ఓట్ల ఆధిక్యతతో విజయం సాధించారు. గుంటూరు, కృష్ణా ఉపాధ్యాయ నియోజకవర్గం శాసనమండలి ఎన్నికల్లో అధికార తెలుగుదేశం పార్టీ బలపరిచిన డాక్టర్‌ ఏఎస్‌ రామకృష్ణ గెలుపొందారు. ఆయన తన సమీప ప్రత్యర్థి, వామపక్షాలు బలపరిచిన పీడీఎఫ్‌ అభ్యర్థి తాజా మాజీ ఎమ్మెల్సీ కె.ఎస్‌.లక్ష్మణ్‌రావుపై 1,763 ఓట్ల ఆధిక్యతలో విజయకేతనం ఎగురవేశారు. మొత్తం 13,047 ఓట్లు పోల్‌ కాగా రామకృష్ణ 7,146, లక్ష్మణ్‌రావు 5,383 ఓట్లు సాధించారు.

ఉభయ గోదావరి జిల్లాల టీచర్ల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చైతన్యరాజుకు ఎదురుగాలి వీచింది. ఆయన పీడీఎఫ్‌ అభ్యర్థి రాము సూర్యారావు చేతిలో పరాజయం పాలయ్యారు. రెండో ప్రాధాన్యత ఓట్లతో సూర్యారావు గట్టెక్కారు. ఈ ఎన్నికలను తెలుగుదేశం పార్టీ ప్రతిష్టాత్మకంగా తీసుకొని చైతన్యరాజుకు మద్ధతు పలికినా రాము సూర్యారావు 15,026 ఓట్లతో విజయం సాధించడం విశేషం. ఉభయ గోదావరి జిల్లాలకు చెందిన అధికార పార్టీ మంత్రు లు, ఎమ్మెల్యేలు జిల్లాల్లో మకాంవేసి చైతన్యరాజు తరఫున ప్రచారం నిర్వహిం చినా ఫలితం లేకపోయింది. ఇలావుండగా, తెలంగాణాలో మహ బూబ్‌నగర్‌ నియోజకవర్గ పట్టభద్రుల ఎన్నికల్లో మొదటి ప్రాధాన్యత ఓట్లతోనే ఎన్‌.రాంచందర్‌రావు విజయం సాధిం చడం గమనార్హం.

మహబూబ్‌నగర్‌, రంగారెడ్డి, హైదరాబాద్‌ పట్టభద్రుల నియోజకవర్గానికి జరిగిన ఈ ఎన్నికలను అటు భాజపా, ఇటు తెరాస ప్రతిష్టాత్మకంగా తీసుకొని బరిలోకి దిగాయి. తెలుగుదేశం పార్టీ సైతం ఈ ఎన్నికలను సవాల్‌గా తీసు కొని ముమ్మరంగా ప్రచారం నిర్వహిం చింది. నల్గొండ, ఖమ్మం, వరంగల్‌ పట్టభద్రుల నియోజకవర్గ శాసనమండలి ఎన్నికల ఓట్ల లెక్కింపు బుధవారం పొద్దుపోయేంద వరకూ జరిగింది. కడపటి వార్తలు అందేసరికి తెరాస అభ్యర్థి పల్లా రాజేశ్వర్‌రెడ్డి సమీప భాజపా అభ్యర్థి ఎర్రబెల్లి రామ్మోహన్‌రావుపై ఆధిక్యంలో ఉన్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: