ధావన్‌ ఔటే మ్యాచ్‌ను మలుపు తిప్పిందని టీమిండియా కెప్టెన్ ధోనీ వ్యాఖ్యానించారు. ఆసిస్‌తో గురువారం ఓడిపోయిన తర్వాత ధోనీ మీడియాతో మాట్లాడుతూ సెమీస్‌లో ఓటమి నుంచి ఆటగాళ్లు గుణపాఠం చేర్చుకోవాలన్నారు.ఇండియాకు మద్దతుగా నిలిచిన అభిమానులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. 300 పరుగులకు పైగా టార్గెట్‌ను చేధించడం కష్టమని ధోనీ అన్నారు. వరల్డ్‌ కప్‌లో తమ టీమిండియా తీరుపై ఆయన సంతృప్తి వ్యక్తం చేశారు. టాప్‌ ఆర్డర్‌ విఫలమైనప్పుడు లోయర్‌ ఆర్డర్‌తో ఏమీ చేయలేమని ధోనీ వాపోయారు. ప్రస్తుతనికి రిటైర్‌మెంట్‌ ఆలోచన లేదని, టీ 20 వరల్డ్‌ కప్‌ తర్వాతే దానిని గురించి ఆలోచిస్తానని ధోనీ చెప్పారు. ఇదిలావుండగా వరల్డ్ కప్ లో భారత్‌ ఓటమిని జీర్ణించుకోలేని క్రికెట్ అభిమానులు టీవీలను పగులగొట్టారు. టీమిండియా ఆటగాళ్ల ఫోటోలకు నిప్పు పెట్టారు. దీంతో రాంచీలోని ధోనీ నివాసం వద్ద పోలీస్‌ బందోబస్తును పెంచారు.

మరింత సమాచారం తెలుసుకోండి: