ఆంధ్రా అసెంబ్లీ రెండో బడ్జెట్ సమావేశాలు ముగిశాయి. గత సమావేశాల కంటే ఈ మీటింగ్స్ భిన్నంగా సాగాయి. ఎన్నడూ లేనంత ఉద్రిక్తతలకు, మాటలయుద్ధానికి దారి తీశాయి. అసెంబ్లీ సమావేశాలు  అన్నాక సస్పెన్షన్లు.. సాధారణమే అయినా.. సభాహక్కుల నోటీసులు, స్పీకర్ పైనే అవిశాస్వం పెట్టడం వంటి అరుదైన ఘటనలకూ ఈ సమావేశాలు వేదికగా నిలిచాయి. 

సమావేశాల ప్రారంభంలో ప్రతిపక్ష నేత జగన్ యమా దూకూడుగా కనిపించారు. స్పీకర్ పై పదే పదే విమర్సలు చేశారు. ప్రతిపక్షంపైనా చురకలు వేశారు. తన మైక్ కట్ అయితే చాలు.. సభలో ప్రకంపనలు సృష్టించారు. తొలి వారం రోజుల్లో సభలో జగన్ దూకుడే కనిపించింది. 

ఆ తర్వాత స్పీకర్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయడం బొండా ఉమ అసెంబ్లీలో పాతేస్తా అనడం.. వైసీపీ సభ్యులు ఫ్యాక్షనిస్ట్ స్పీకర్ అంటూ నినాదాలు చేయడం జరిగిపోయాయి.. ఈ ఘటన తర్వాత జగన్ ప్రవర్తనలో అనూహ్యమైన మార్పు కనిపించింది. అప్పటివరకూ పులిలా రెచ్చిపోయిన జగన్.. ఒక్కసారిగా పిల్లిలా మారిపోయారు. 

ఆ రెండు, మూడు రోజులు సభలకు గైర్హాజరైనా.. చివరి రెండు రోజులు మరింత డీలాగా కనిపించారు. బేషరతుగా క్షమాపణలు చెప్పడం, అవిశ్వాసం తీర్మానం వెనక్కి తీసుకోవడం వంటి చర్యలతో జగన్ పూర్తిగా డిఫెన్సులో పడిపోయారు. తొలి రోజుల్లో వచ్చిన క్రెడిట్ కాస్తా.. చివరి రోజుల ప్రవర్తనలో ఆవిరైపోయింది. స్పీకర్ చేతిలో విశేషాధికారాలు ఉండటం.. ఎమ్మెల్యేలపై బహిష్కరణ భయం జగన్ తో ఈ పనిచేయించాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: