ప్రజాప్రతినిదుల ఫిరాయింపులపై చర్యలు తీసుకునే అదికారం రాష్ట్రపతి, గవర్నర్ లకు ఇవ్వాలని న్యాయ కమిషన్ నివేదిక సూచించింది.ప్రస్తుతం శాసనసభల స్పీకర్లు, శాసనమండలి ఛైర్మన్ లకు, లోక్ సభలో స్పీకర్,రాజ్యసభలో ఉపాధ్యక్షుడికి ఫిరాయింపులపై నిర్ణయం తీసుకునే అదికారం ఉంది.కాని ఎక్కువ అసెంబ్లీలలో ఫిరాయింపులపై స్పీకర్ లు నిర్ణయం తీసుకుంటున్న తీరు వివాదాస్పదం అవుతున్నాయి.రాజకీయంగా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం వల్ల కొత్త సమస్యలు వస్తున్నాయి. ఒక్కోసారి హడావుడిగా వేటు వేస్తున్నారు.

తెలంగాణలో టిడిపి ఎమ్మెల్యే ప్రస్తుతం టిఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నారు.ఆయన రాజీనామాను ఆమోదించడం లేదు.అలాగే ఫిరాయింపు పిటిషన్ పై చర్య తీసుకోవడం లేదు.అలాగే కాంగ్రెస్ ,వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు టిఆర్ఎస్ లోకి వెళ్లారు.వైఎస్ ఆర్ కాంగ్రెస్ ఎమ్.పిలు ఇద్దరు టిడిపిలోకి వెళ్లారు.ఈ నేపధ్యంలో లా కమిషన్ వివిధ రాష్ట్రాలలోని పరిస్థితిని గమనించి ఈ సిఫారస్ చేసింది.దీనిన ఉభయ పార్లమెంటు సభలకు సమర్పిస్తారు.కేంద్ర ప్రభుత్వం ఒకే చేస్తే మార్పు జరుగుతుంది.లేకుంటే నివేదికకే పరిమితం అవుతుంది.మరి ఏమి జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: