గత కొంత కాలంగా ఉత్కంఠంగా కొనసాగుతున్న మా ఎన్నికల రణరంగానికి నేడు తెర పడనుంది. మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) అధ్యక్ష ఎన్నికల పోలింగ్ హైదరాబాద్‌లోని ఫిలిం ఛాంబర్ ఆఫ్ కామర్స్ భవనంలో జరుగుతోంది. ఆదివారం ఉదయం 8 గంటలకు పోలింగ్ ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటల వరకు పోలింగ్ జరగనుంది.పోలింగ్ కోసం ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషిన్లను (ఈవీఎం) వినియోగిస్తున్నారు. ‘మా’లోని 702 మంది సభ్యులు ఈ సందర్భంగా ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. మా’ ఎన్నికల విషయంలో కొందరు న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో కోర్టు పర్యవేక్షణలో ఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల ప్రక్రియను వీడియో తీస్తున్నారు. కోర్టు ఆదేశాల తర్వాతే ఎన్నికల కౌంటింగ్, ఫలితాల వెల్లడి జరుగుతుంది. 


మూవీ ఆర్టిస్ట్సు అసోసియేషన్‌  అక్టోబర్ 4న మా ఏర్పాటైంది. ఏకగ్రీవంగా తొలి అయిదు కార్యవర్గాలు సభ్యులను ఎన్నుకున్నారు. 2000లో తొలిసారి ఎన్నికలు జరిగాయి. 2002లో మా అధ్యక్ష పదవికి మురళీమోహన్, రాజేంద్రప్రసాద్‌లు పోటీ పడ్డారు. అప్పుడు ఆ ఎన్నికల్లో 8 ఓట్లతేడాతో ఓడిన రాజేంద్రప్రసాద్ ఓడిపోయారు. చిరంజీవి మా వ్యవస్థాపక అధ్యక్షుడు. గతంలో మా అధ్యక్షులుగా కృష్ణ, నాగార్జున, మోహన్‌బాబు, నాగబాబు, మురళీమోహన్ లు అధ్యక్ష పదవిలో ఉన్నారు. మురళీ మోహన్ అత్యధికంగా 6 సార్లు (12 ఏళ్లు) అధ్యక్షపదవి లో ఉన్నారు. మా సభ్యత్వం కనీసం 8 చిత్రాల్లో నటిస్తే తీసుకోవచ్చు. 1993 నుంచి ఇప్పటి వరకూ మా ఆఫీస్ ఫిల్మ్‌చాంబర్‌లోని అద్దె భవనంలోనే ఉన్నది. 

మరింత సమాచారం తెలుసుకోండి: