పట్టిసీమ.. తెలుగు దేశం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ప్రాజెక్టు ఇది. ఏడాదిలో దీన్ని పూర్తి చేయాలని చంద్రబాబు ఛాలెంజింగ్ గా తీసుకున్నారు. ఎలాగైనా గోదావరి నీళ్లను రాయలసీమకు తరలించి క్రెడిట్ కొట్టేయాలని పట్టుదలతో ఉన్నారు. అందుకే శరవేగంగా పట్టిసీమవైపు అడుగులేస్తున్నారు. 

అందుకే ఆఘమేఘాల మీద పట్టిసీమకు శంకుస్థాపన చేసేశారు. కానీ పట్టిసీమపై చంద్రబాబుకు ఉన్న సీరియస్ నెస్.. సమాచార శాఖ అధికారులకు లేకపోయింది. అసలే మీడియా మేనేజ్ మెంట్ లో దిట్టగా పేరు చంద్రబాబు హయాంలోనే అధికారులు గుడ్డిగా పనిచేస్తూ.. ఆయనకు తలవంపు తీసుకొచ్చారు. 

పట్టిసీమ శంకుస్థాపన కోసం అన్ని ప్రముఖ దిన పత్రికల్లోనూ ఏపీ ప్రభుత్వం ప్రకటనలు ఇచ్చింది. దాదాపు అరపేజీ కంటే ఎక్కువగానే ఉన్న ఈ యాడ్ నీటిపారుదలపై ప్రాధమిక అవగాహన ఉన్నవారంతా ముక్కున వేలేసుకున్నారు. సర్కారు ప్రకటనలో మరీ ఇంత బ్లండర్ మిస్టేకులా అని ఆశ్చర్యపోయారు. ఇంత కీలకమైన ప్రకటనను మరీ అంత కళ్లు మూసుకుని ఎలా ఇచ్చారబ్బా అని ఆశ్చర్యపోయారు. 

ఇంతకీ తప్పు ఏం జరిగిందంటే.. పట్టిసీమ కోసం ప్రభుత్వం 30కు పైగా పంపులు వాడాలని నిర్ణయించింది. కానీ ప్రకటనలో ఇవి కేవలం 15అనే పేర్కొన్నారు. ఇదే పెద్ద తప్పు అనుకుంటే అంతకంటే పెద్ద తప్పు నీటి పరిమాణం విషయంలో చేశారు. 1500 క్యూసెక్కుల నీటి నిల్వ చేయు సామర్థ్యం నిర్మాణం లక్ష్యం అని ప్రకటనలో పేర్కొన్నారు. 

ఇందులో మొదటి శుద్ధ తప్పేమిటంటే.. నీటి నిలువను క్యూసెక్కుల్లో కొలవరు. టీఎంసీల్లో, జీఎండీల్లో కొలుస్తారు. రెండో తప్పేమిటంటే.. పోనీ క్యూసెక్కుల్లో ఇచ్చినా.. అది చాలా చిన్న పరిమాణం. అసలు 1500 క్యూసెక్కులు అనేది చాలా చిన్న పరిమాణం. అసలు పట్టిసీమ ప్రాజెక్టు విషయంలో నీటి నిల్వ ఎక్కడా లేదని వైసీపీ విమర్శిస్తోంది కూడా. 

ఇప్పుడు ఇదే తప్పుతో సాక్షి ఆటాడుకుంది. ప్రభుత్వ ప్రకటనలో.. అదీ పట్టిసీమలాంటి ప్రాజెక్టు విషయంలో ఇన్ని తప్పులా అని నిలదీసింది. బ్రేకింగుల మీద మీద బ్రేకింగులు వేసి నానా హడావిడి చేసింది. ప్రభుత్వ ప్రకటన చూసి నిపుణులు ఆశ్చర్యపోతున్నారని బ్రేకింగులు వేసింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: