విద్యుత్ సంక్షోభంతో రాష్ట్రం కొట్టుమిట్టాడుతుంది. డిమాండుకు సంఫరాకు మధ్య వ్యత్యాసం బాగా పెరిగిపోయింది. ప్రస్తుతం ప్రతిరోజు 212.05 మిలియన్ యూనిట్ల విద్యుత్ సరఫరా అవుతుండగా ఇంకా 23.44 మిలయన్ యూనిట్ల కొరత రోజుకి ఏర్పడుతుంది. జెన్ కో ఏర్పడినప్పటి నుంచి 33,502 మిలియన్ యూపనిట్లను ఉత్పత్తి చేయగా బుధవారం అంటే ఈనెల 4వ తేదీ నాటికి కేవలం 143.63 మిలియన్ యూనిట్లనే ఉత్పత్తి చేయగలిగింది. వర్షాలు లేక రిజర్వాయర్ల నీటిమట్టం బాగా పడిపోవటంతో జలవిద్యుత్ ఉత్పత్తి అంతంతమాత్రమే సాగుతుంది. ఇక థర్మల్ కేంద్రాంకు సక్రమంగా బొగ్గు సరఫరా కాకపోవడం, సాంకేతికపరమైన ఇబ్బందులు ఏర్పడటం వల్ల ముఖ్యమైన ఉత్పత్తి కేంద్రాలలో యూనిట్లు పనిచేయకుండా నిలిచిపోయాయి. థర్మల్ విద్యుత్ ఉత్పత్తి విషయంలో 1994 – 95 నుంచి 2004 – 05 వరకు 89.7 శాతం ప్లాంట్ లోడ్ ఫ్యాక్టరీ (పిఎల్ఎఫ్)ను సాధించి దేశంలోనే మొదటి స్థానంలో నిలిచి అవార్డును అందుకున్న విటిపిఎస్, ఆర్ టిపిపిల పరిస్థితి నేడు అధ్వానంగా తయ్యారయింది. గ్యాస్ సరఫరా అందుబాటులో లేక పోవడంతో గ్యాస్ ఆధారిత ఉత్పత్తి కేంద్రాలు కూడా వెలవెలపోతున్నాయి. రాష్ట్ర రాజధానిలోనే కాకుండా మిగితా ముఖ్యపూటనే కాకుండా రాత్రి వేళ్ళలో కూడా గంటల తరబడిగా విద్యుత్ సరఫరా నిలిచిపోతుంది. కరెంటు ఎప్పుడొస్తుందో పోతుందో అని వినియోగదారులు బేజారవుతున్నారు.వ్యవసాయ రంగానికి రెండు దఫాలుగా ఏడు గంటల విద్యుత్ సరఫరా చేస్తున్నాట్లు, చిన్న తరహా పరిశ్రమలు, స్టన్నింగ్, రైస్ మిల్లులు, కోళ్ళ ఫారాలు, ప్రభుత్వ ఆసపత్రులు, త్రాగునీరు, విత్తన శుద్ధి, ప్రాణాంతక మందులు వంటి అత్యవనర సర్విసులను విద్యుత్ కోత నుంచి మినహాయింపునిచ్చినట్లు అధికారులు చెపుతున్నారు. కానీ వాస్తవ పరిస్థితులు అందుకు భిన్నంగా ఉన్నాయి. గత ఏడాది జూన్ లో పోలిస్తే గత జూన్ లో మిద్యుత్ డిమాండ్ సుమారు 15.06 శాతం మేరకు పెరిగింది. గత ఏడాది జూన్ లో రోజుకి 218.91 మిలియన్ యూనిట్లను సరఫరా చేయగా ఈసారి 251.89 మిలియన్ యూనిట్లకు డిమాండ్ పెరిగింది. ఈ సారి రుతుపవనాలు దోబుచులాడటంతో పరిస్థితులు సంక్షోభానికి దారితీసే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని థర్మల్, జలవిద్ముత్ కేంద్రలు బుధవారం నాటికి సాధించిన ఉత్పత్తి వివరాలు పరిశీలించినప్పుడు విజయవాడ నార్లతతరావు థర్మల్ విద్యుత్ కేంద్రంలోని. మొత్తం ఏడు మూనిట్ల ఉత్పత్తి సామర్థ్యం 1760 మెగావాట్లు ఉండగా అందులోంచి కేవలం 119.21 మిలియన్ యూనిట్ల జరిగింది, రాయలసీమ లోని ఐదుయూనిట్లు కాగా 48.69 మిలియన్ యూనిట్లు, కొత్తగూడెం ఎబిసిలోని అన్ని యూనిట్లు కలిసి 1000 మెగావాట్లు ఉండగా 68.94 ఎం.యు, రామగుండం 62.5 మెగావాట్లు సామర్థ్యంలో 4.49 మిలియన్ యూనిట్లు ఉత్పత్తి సాధించింది. ఇక ఎపి జెన్ కో థర్మల్ కేంద్రంలో మొత్తం 509.5 మెగావాట్ల సామర్థ్యం ఉండగా ఈనెల 4వ తేదీనాటికి 313.98 మిలియన్ యూనిట్లు, ఎపిజెన్ కో జలవిద్యుత్ కేంద్రంలో 3829.4 మెగావాట్ల సామర్థ్యం ఉండగా ఈ రోజు కేవలం 513.72 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి జరిగింది. మొత్తం మీద రాష్ట్రం విద్యుత్ సంక్షోభంతో కొట్టుమిట్టాడుతుంది. ఈ పరిస్థతి నుంచి గట్టెక్కడానికి ఆదుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన అభ్యత్వం చేసిన అభ్యరన పై కేంద్రం ఏ మేరకు స్పందించగలదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: