అధికారంలో ఉన్నవారు ఏం చేసినా చెల్లుతుంది. అధికారంలో ఉన్నవారు మనవారైతే.. ఇక ఏ ఆట ఆడినా నడిచిపోతుంది. ఇప్పుడు కొందరు మంత్రులు, వారి అనుచరుల తీరు చూస్తే అలాగే అనిపిస్తుంది. చాలా మంది మంత్రులు అధికారిక కార్యక్రమాల కోసం పీఆర్వోలను నియమించుకుంటారు. 

సహజంగా తమ సొంత వారినే అందుకు నియమించుకుంటారు. అందుకే వారు పని చేసినా.. చేయకపోయినా నడిచిపోతుంది. మంత్రి కార్యక్రమాల గురించి మీడియాకు ముందుగా సమాచారం ఇవ్వడం.. కార్యక్రమానికి సంబంధించి పత్రికా ప్రకటన పంపించడం.. పీఆర్వోల పని.

మీడియాలో సదరు మంత్రి గురించి వచ్చే పాజిటివ్, నెగిటివ్ వార్తలను ఆయన దృష్టికి తీసుకెళ్లడం కూడా పీఆర్వోల బాధ్యతే.. కానీ చాలా మంది పీఆర్వోలు..ఆ పని చేయడం లేదు. మంత్రిగారి కార్యక్రమాలు జరిగిన వేళ.. ఆ ఫోటోలను మీడియా మెయిళ్లకు ఫార్వార్డ్ చేసేసి చేతులు దులుపుకుంటున్నారు. 

అది ఏ కార్యక్రమం.. ఎలా జరిగింది.. మంత్రి ఏం మాట్లాడారు.. ఇలాంటి కనీస వివరాలు ఇవ్వకుండా జస్ట్ సింపుల్ గా ఫోటోలు పంపించేసి ఊరుకుంటున్నారు. మంత్రిగారి సొంత మనుషులు కావడంతో వీళ్లపై పర్యవేక్షణ కూడా అంతగా ఉండదు. ఆ మాత్రం పని చేసేందుకు వీరికి 50 వేల నుంచి లక్ష రూపాయల వరకూ జీతాలు తీసుకుంటున్నారు. అత్త సొమ్ము అల్లుడు దానం అంటే ఇదే కాబోలు..

మరింత సమాచారం తెలుసుకోండి: