పవన్ కల్యాణ్ సినిమా అత్తారింటికి దారేది చూసే ఉంటారు. ఆ సినిమాలో ఓ అద్భుతమైన డైలాగ్ ఉంటుంది. ఎక్కడ నెగ్గాలో కాదు.. ఎక్కడ తగ్గాలో తెలిసిన వాడే అసలైన నాయకుడు.. అని.. ఇప్పుడు వైసీపీ అధినేత ఆ డైలాగ్ నే ఫాలో అవుతున్నట్టు కనిపిస్తున్నారు. 


వైసీపీ అధినేత ఆ డైలాగ్ నే ఫాలో అవుతున్నట్టు

అసెంబ్లీ సమావేశాల చివరి రోజులను ఓసారి పరిశీలిస్తే.. ఆయన పవన్ ఫార్ములాని పాటించినట్ట ఇట్టే తెలిసిపోతుంది. సమావేశాల ప్రారంభం నుంచి మాంచి దూకుడుగా వ్యవహరించిన జగన్.. ఆ తర్వాత చివరికి వచ్చేసరికి రూట్ మార్చేశారు. అనూహ్యంగా స్పీకర్ కు క్షమాపణ చెప్పి గొడవ సద్దుమణిగేలా చేశారు.


స్పీకర్ పైకి దూసుకెళ్లి నినాదాలు


అసెంబ్లీ సమావేశా తొలిరోజులు కానీ.. స్పీకర్ పైకి దూసుకెళ్లి నినాదాలు చేసిన రోజు కానీ.. ముందు ముందు ఈ ఘటనలకు జగన్ క్షమాపణ చెబుతాడని అస్సలు ఊహించలేం. అప్పటివరకూ రెబల్ స్టార్ గా రెచ్చిపోయిన జగన్ టీమ్.. అకస్మాత్తుగా వ్యూహం మార్చడం వెనుక.. పవన్ ఫార్ములాయే కనిపిస్తోంది. 


ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల.


ఇంకా ఎన్నికలకు నాలుగేళ్ల సమయం ఉన్న నేపథ్యంలో అప్పుడే రచ్చ రచ్చ చేయడం ఎందుకు అన్న యాంగిల్లో జగన్ ఆలోచించి ఉంటారు. మొత్తానికి ఈ అసెంబ్లీ సమావేశాల వల్ల.. జగన్ లోని భిన్న కోణాలను, హావ భావాలను చూసే అవకాశం అటు పార్టీ కార్యకర్తలకు.. ఇటు టీవీ సెట్ల ముందు కూర్చున్న అశేషాంధ్ర ప్రజానీకానికీ దక్కింది. 

మరింత సమాచారం తెలుసుకోండి: