తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన అర్బన్ నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలో మంత్రి పల్లె రఘునాథరెడ్డి సమక్షంలోనే తెలుగు తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. అర్బన్ ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి, మేయర్ స్వరూప వర్గాలు పరస్పరం కుమ్ములాటకు దిగారు. దూషణల పర్వం పూర్తిచేసి కొట్లాటకు దిగారు. మంత్రి చూస్తుండగానే కుర్చీలు గాలిలోకి ఎగిరి పడ్డాయి. కొందరు కార్యకర్తల తలలు పగిలాయి. రక్తం ఓడుతున్న పలువురిని అప్పటికప్పుడు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి అధ్యక్షతన క్రీసెంట్ ఫంక్షన్ హాలులో ఆదివారం జరిగిన సమావేశానికి మంత్రి పల్లె రఘునాథరెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

తెలుగు తమ్ముళ్లు బాహాబాహీ


నగర మేయర్ స్వరూప, డిప్యూటీ మేయర్ సాకే గంపన్నతోపాటు పార్టీ నాయకులు, కార్పొరేటర్లు, కార్యకర్తలు సమావేశంలో పాల్గొన్నారు.ఎమ్మెల్యే ప్రభాకర చౌదరి మాట్లాడుతున్న సమయంలో మడ్డిపల్లి వెంకటరాముడు పార్టీ కార్యకర్తలకు న్యాయం చేయలేదని, ప్రాధాన్యత ఇవ్వకుండా అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆగ్రహానికి గురైన ఎమ్మెల్యే బయటికి పొమ్మని ఆదేశించారు. కొందరు నాయకులు, కార్పొరేటర్లు వెంకటరాముడుకు మద్దతుగా నిలిచారు. దీనితో అక్కడ ఒక్కసారిగా యుద్ధ వాతావరణం నెలకొంది. ఒకరికొకలు దూషణలకు దిగారు. పరస్పరం దాడికి పాల్పడ్డారు. కుర్చీలు విరిగిపోయేంతగా కొట్టుకున్నారు.

Untitled.jpg (573×299)

ఇందులో 25వ డివిజన్ కార్పొరేటర్ మంగమ్మ భర్త నారాయణస్వామి తలకు గాయమయింది. 29వ డివిజన్ కార్పొరేటర్ ఉమామహేష్‌కు చొక్కా చినిగింది. మాజీ కార్పొరేటర్ అమర్‌నాథ్ తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు జోక్యం చేసుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. గాయపడ్డ కార్యకర్తలు, వారి మద్దతుదారులు ఎమ్మెల్యేకి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ధర్నాకు దిగారు. ధర్నా చేస్తున్నవారిని త్రీటౌన్ పోలీసులు అరెస్ట్ చేసి అనంతరం విడుదల చేశారు. క్రమశిక్షణను ఉల్లంఘించిన వారిపై చర్యలు చేపడతామని మంత్రి పల్లె ఈ సందర్భంగా పేర్కొన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: