రాజకీయ, ఆర్థిక రంగాలతో పాటు అన్నిరంగాల్లోనూ కమ్మ కులస్తులు దూసుకుపోతున్న రోజులివి. విదేశాలకు వెళ్తున్న ఆంధ్రులలోనూ కమ్మ వారి సంఖ్య ఎక్కువే. ప్రపంచమంతటా విస్తరించిన కమ్మ కులస్తుల కోసం.. కమ్మ ప్రముఖుల విశేషాలతో ఓ పుస్తకం రూపొందించారు. 

నాదెండ్ల శివనాగేశ్వరరావు ఈ పుస్తకం రాశారు. ఈ పుస్తకాన్ని ఏపీ సభాపతి కోడెల శివప్రసాదరావు ఆవిష్కరించారు. ఆ కార్యక్రమం హైదరాబాద్ శ్రీనగర్ లోని శ్రీ సత్యసాయి నిగమాగమంలో జరిగింది. 

పుస్తకావిష్కరణ అనంతరం కోడెల ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. విదేశాల్లో ఉన్న తెలుగువారిలో కమ్మవారే ఎక్కువ మంది ఉన్నారని వ్యాఖ్యానించారు. బెస్ట్ ఎన్నారై గ్రూపులో కమ్మ సామాజిక వర్గం ఉందన్నారు కోడెల. 

అన్ని రంగాల్లోనూ ముందున్న కమ్మకులస్తులు సొంత కులం అభివృద్ధి గురించే కాక ఇతర కులస్తులను కూడా అన్నిరంగాల్లో ప్రోత్సహించాలన్నారు. అందరినీ కలుపుకుని పోయినప్పుడే 
కమ్మ కులస్తుల గౌరవం కూడా ఇనుమడిస్తుందని సూచించారు. కమ్మలు సామాజిక సేవాభావం అలవర్చుకుని అందరికీ ఆదర్శంగా నిలవాలని సూచించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: