భారతీయ జనతా పార్టీ తెలంగాణ విభాగం అధ్యక్షుడు కిషన్ రెడ్డి కి ఉన్న రాజకీయ శక్తి ఎంత? ఆయన ఇక్కడి భారతీయ జనతా పార్టీని ఏ మేరకు ప్రభావం చూపగలడు? అంటే.. ఆయనకు పార్టీ ఉన్న అధికారాలు నామమాత్రమేనని అంటున్నారు కమలనాథులు. కేంద్రంలో పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో ఇక్కడి వ్యవహారాల గురించి ఇతర నేతల పెత్తనమే ఎక్కువగా ఉందని.. కిషన్ రెడ్డికి ఏమీ సూపర్ పవర్స్ చేతిలో లేవని వారు అంటున్నారు. తెలంగాణకు సంబంధించిన ఎంపీ బండారు దత్తాత్రేయ కేంద్రమంత్రిగా ఉన్నాడు. 


కిషన్ రెడ్డికి అధికారాలేమీ లేవని భోగట్టా

Image result for ghmc elections at hyderabad kishan reddy

ఆయన కేంద్రంలో తన పరపతిని ఉపయోగించుకొని పార్టీ తెలంగాణ విభాగంపై పెత్తనం చేయడమే గాకుండా.. మంత్రిగా ఉన్న అధికారాలతో రాష్ట్ర స్థాయి బలగాన్ని కూడా తన చేతిలో పెట్టుకొంటున్నట్టుగా వార్తలొస్తున్నాయి. ఇక విధానపరమైన అంశాల్లోఅయితే కిషన్ రెడ్డికి అధికారాలేమీ లేవని భోగట్టా. వెనుకటికి తెలుగుదేశం పార్టీ తో పొత్తు ఉండదని పదే పదే ప్రకటించాడు కిషన్. అయితే చివరకు మాత్రం అధిష్టానం టీడీపీతో పొత్తు పెట్టుకొంది. ఆ విషయంలో కిషన్ రెడ్డి వాదనకు బీజేపీ నేషనల్ లీడర్లు పెద్దగా విలువనివ్వలేదు. 


 కిషన్ రెడ్డి తనకు తానే మరో పరీక్ష పెట్టుకొన్నాడు.


ఇక ఇప్పుడు కిషన్ రెడ్డి తనకు తానే మరో పరీక్ష పెట్టుకొన్నాడు. గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల అంశం గురించి మాట్లాడుతూ ప్రస్తుతానికి తమకు ఆ ఎన్నికల్లో తెలుగుదేశంతో పొత్తు పెట్టుకొనే ఐడియా ఏమీ లేదని ఆయన అంటున్నాడు.   అలాగే భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే కూటమిలోకి తెలంగాణ రాష్ట్ర సమితి చేరే అవకాశాలు కూడా లేవని కిషన్ రెడ్డి చెప్పుకొచ్చాడు. మరి కిషన్ రెడ్డి తెలంగాణ విభాగానికి అధ్యక్షుడి హోదాలో ఈ ప్రకటనలు చేయడం వరకూ బాగానే ఉంది కానీ.. ఈయన ఆలోచించినట్టుగానే జాతీయ స్థాయి నేతలు ఆలోచిస్తారా? ఈయన అభిప్రాయాలకు వారు విలువనిస్తారా? అనేవి సందేహాలు. మరి ఆ అంశాల గురించి బీజేపీ అధిష్టానం క్లారిటీ ఇస్తే.. కిషన్ అభిప్రాయాలకు వారిచ్చే విలువ ఏమిటో తెలుస్తుంది!


మరింత సమాచారం తెలుసుకోండి: