స్త్రీ అందాలలో మగవాళ్లను ఆకట్టుకునే వాటిలో స్తనాలదే మొట్టమొదటి స్థానం. ఆకట్టుకునే ముఖలావణ్యం, ఒడ్డూ పొడుగూ ఉన్నా.. తగినంత పరిమాణంలో ఎద సంపద లేకపోతే.. ఆ స్త్రీ అందానికి పరిపూర్ణత చేకూరదు. మరీ ఎక్కువా.. మరీ తక్కువా కాకుండా.. నిండుగా ఉండే స్తన సౌందర్యం పురుషుణ్ణి కట్టిపడేస్తుందనడంలో సందేహం లేదు. 

సైజులో ఎక్కువ తక్కువలున్నా.. మహిళలందరికీ రెండు స్తనాలే ఉంటాయన్న సంగతి తెలిసిందే. మరి అలా అందరిలా రెండు కాకుండా మూడు స్తనాలుంటే.. మూడు స్తనాలా.. నెవ్వర్. అనుకుంటున్నారా.. నిజమండీ.. ఆమెకు నిజంగానే మూడున్నాయి. 

ఈ విచిత్రమైన మూడు స్తనాల అమ్మడు అమెరికాలో ఉంది. మరి మూడు స్తనాలు వచ్చాయంటే.. అదేమైనా జన్యుపరమైన తేడా అనుకుంటున్నారేమో.. అదేం కాదు.. అది ఆ ముద్దుగుమ్మ విచిత్రమైన కోరిక. అందరిలోకీ విభిన్నంగా ఉండాలనుకున్న ఆమె మనస్తత్వమే ఈ విచిత్రానికి ప్రాణం పోసింది.

అమెరికాలోని ఫ్లోరిడాకు చెందిన జాస్మిన్ అనే అమ్మడికి అందరిలా రెండు స్తనాలు కాకుండా మూడు ఉంటే ఎలా ఉంటుంది అన్న ఆలోచన వచ్చేసింది. ఆలోచన వచ్చిందే తడవుగా ఆ ప్రయత్నాలు మొదలుపెట్టింది. చాలా మంది వైద్యులను సంప్రదించింది. కానీ అంతా జాస్మిన్ కు పిచ్చిపట్టిందని అన్నారే కానీ.. మూడో స్తనం పెడతామని చెప్పలేదట. 

పట్టువదలని జాస్మిన్ కు చివరకు ఓ వైద్యుడు సాయం చేశాడట. అయితే ఆయన పేరు మాత్రం చెప్పనంటోందీ అమ్మడు. 21 ఏళ్ల ఈ అమ్మడు.. చివరకు ప్లాస్టిక్ సర్జరీ ద్వారా తన కోరిక నెరవేర్చుకుంది. నెట్లో ఈమె ఫోటోలు సంచలనం సృష్టించడంతో.. అవి నిజమా కాదా.. మార్ఫింగా అని చర్చించుకున్నారు.. చివరకు అవి నిజమే అని తేలింది. 

ఈ మూడు స్తనాల ఐడియా మగాళ్లను ఆకట్టుకునేందుకు కాదట.. వాళ్లకు వికారంగా కనిపించేందుకే ఈ తాపత్రయమని వింత వాదన వినిపిస్తోందీ జాస్మిన్.  మగాళ్లతో సెక్స్ అంటే తనకు ఏమాత్రం ఇష్టం లేదని.. అందుకే వాళ్ల దృష్టి తనపై పడకుండా.. ఇలా మూడో స్తనం పెట్టించుకున్నానని చెబుతోంది. 

ఈ త్రిస్తన సౌందర్యంతో జాస్మిన్ కొన్ని ప్లస్ పాయింట్లు, కొన్ని మైనస్ పాయింట్లున్నాయట.. పార్కులకు, పబ్లిక్ ప్లేసులకు వెళ్తే అంతా నెగిటివ్ కామెంట్లు చేస్తున్నారట. అదే పబ్బులు, బార్లకు వెళ్తే మాత్రం మంచి స్పందన కనిపిస్తోందట.  ఇదీ మూడు స్తనాల అమ్మడి కథ.


మరింత సమాచారం తెలుసుకోండి: