తమిళనాడు పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారారు డీఎండీకే అధినేత విజయ్ కాంత్. పవర్ కోసం కొత్త దారి వెతుక్కుంటున్నారు. డీఎంకే తో దోస్తీకి రెడీ అంటూ సంకేతాలిస్తున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో అన్నాడీఎంకేతో పొత్తుపెట్టుకుని మంచి ఫలితాలు సాధించారు. కానీ కొద్ది రోజులకే వీరి ఫ్రెండ్ షిప్ కు ఎండ్ కార్డ్ పడింది. దీంతో ఎన్డీఏ కూటమిలో చేరిపోయారు. అయితే.. ఈ దోస్తీ కూడా మూన్నాళ్ల ముచ్చటే అయ్యింది. పేరుకు ఎన్ డీఏ కూటమిలో ఉన్నా బీజేపీతో మాత్రం అంటీ ముట్టనట్టుగానే వ్యవహరిస్తున్నారు విజయ్ కాంత్. అయితే ఇదంతా ఫ్యూచర్ ప్లాన్ లో భాగంగానే చేస్తున్నారని తమిళనాడు పొలిటీషియన్స్ చర్చించుకుంటున్నారు. రాబోయే ఎలక్షన్స్ లో ఎలాగైనా అధికారం పీఠంలో కూర్చోవాలనే ఏకైక లక్ష్యంతో విజయకాంత్ ముందుకు పోతున్నాడని టాక్ వినిపిస్తోంది.


ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో డీఎండీకే పార్టీకి చెందిన ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ వేటు పడింది. బీజేపీకి దూరంగా ఉంటున్న విజయ్ కాంత్ కు ఎవరైనా మద్ధతుగా నిలుస్తారో లేదో అనుకున్నారు అందరు. కానీ… విచిత్రంగా సీన్ లోకి ఎంట్రీ ఇచ్చారు డీఎంకే అధినేత కరుణానిధి. డీఎండీకే ఎమ్మెల్యేలకు మద్ధతుగా ప్రకటన చేశారు. అటు విజయ్ కాంత్ కూడా కరుణానిధికి కృతజ్ఞతలు తెలిపారు. దీంతో వీరి ఫ్రెండ్ షిప్ తమిళ పాలిటిక్స్ లో హాట్ టాపిక్ గా మారింది.


మరో ఏడాదిలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. దీంతో రెండు పార్టీలు ఫ్రెండ్ పొత్తు రెడీ అయ్యాయనే ఊహాగానాలు స్టార్ట్ అయ్యాయి. అటు… డీఎండీకే నేతలు కూడా… కరుణానిధి పార్టీతో సంప్రదింపులు జరుపుతున్నారనే వార్తలు దీనికి మరింత బలాన్నిస్తున్నాయి. అయితే దీనిపై ఏ పార్టీ కూడా పూర్తిస్థాయిలో క్లారిటీ ఇవ్వకపోయినా… ఫ్యూచర్ లో డీఎంకే, డీఎండీకేలు కలిసి పోటీచేయడం ఖాయమనే టాక్ వినిపిస్తోంది.



మరింత సమాచారం తెలుసుకోండి: