వైఎస్‌ జగన్‌ ఢిల్లీ పర్యటనపై టిడిపి నేతలు ఎందుకు కలవరపడు తున్నారని వైసిపి నగరి ఎమ్మెల్యే ఆర్కే రోజా ప్రశ్నిం చారు. ప్రతిపక్ష నాయకుడిగా వైఎస్‌ జగన్‌ ప్రజాసమస్యలపై ప్రధాని మోదీని కలిస్తే దాన్ని వక్రీకరించ …డం ఎంతవరకు సమంజసమని అన్నారు. మీరు కలిసి పోటీ చేసిన బిజెపిపైనే నమ్మకం లేదా, మోదీపై మీకేమైనా అనుమా నమా అని సూటిగా ప్రశ్నించారు.


దొడ్డిదారిన మంత్రి అయిన యనమల రామకృష్ణు్ణడు వైఎస్‌ జగన్‌ ను విమర్శించడం వింతగా ఉందన్నారు. పట్టిసీమ ప్రాజెక్టు బండారం బయటపడుతుందని టిడిపి నేతలకు భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు. పట్టిసీమ వల్ల ప్రయోజనం రాయలసీమకు కాదని, చంద్రబా బు, లోకేశ్‌ లకేనని రోజా అన్నారు. తమ పార్టీ అధినేత జగన్‌ ఢిల్లీ వెళ్తే టిడిపి నేతలకు ఎందుకు వెన్నులో వణుకు పుడుతోంది రోజా ప్రశ్నించారు. పట్టిసీమ లో అవినీతిని జగన్‌ ప్రధానికి వివరించారని అన్నారు. టిడిపికి మిత్రపక్షంపై నమ్మకం లేనట్లుందని వ్యాఖ్యానించారు. ప్రధాని స్థాయి వ్యక్తి కోర్టు వ్యవహారా ల్లో జోక్యం చేసుకుంటారా అని ప్రశ్నించారు. టిడిపి నేతల ఆరోపణలు అర్థరహితమని విమర్శించారు.


మరింత సమాచారం తెలుసుకోండి: