పరికరానికి బుర్ర ఉండదు.. దాన్ని వాడుకునే వారి తెలివితేటలపైనే దాని పనితీరు ఆధారపడి ఉంటుంది. కత్తితో కూరగాయలు కోసుకోవచ్చు.. ఆత్మహత్యా చేసుకోవచ్చు. లేదంటే అదే కత్తితో జనాన్ని బెదిరించి దోపీడీలూ చేయొచ్చు. 


సేమ్ ఇదే థియరీ ఇంటర్ నెట్ కు కూడా అప్లై అవుతుంది. అంతర్జాలాన్ని విజ్ఞానం పెంచుకునేందుకు.. రెగ్యులర్ న్యూస్ అప్ డేట్స్ తెలుసుకునేందుకు వాడుకోవచ్చు. అదే నెట్ లో పోర్న్ సైట్స్ వల్లో పడి విలువైన సమయం వృథా చేసుకునేవారూ ఉన్నారు. 

ఇప్పుడు నెట్ తో టచ్ ఉన్నవాళ్లలో ఫేస్ బుక్, ట్విట్టర్ తెలియని వారు చాలా అరుదు. గతంలో పోర్న్ సైట్స్ కు మాత్రమే పరిమితమయ్యే బూతు బొమ్మలు.. ఇప్పుడు సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలోనూ హల్ చల్ చేస్తున్నాయి. ప్రతిరోజు సుమారు 5లక్షల న్యూడ్ ఫోటోలు ఈ సోషల్ నెట్ వర్కింగ్ సైట్లలో పోస్ట్ అవుతున్నాయట. 

ఫేస్ బుక్ ,యూట్యూబ్ వంటి కొన్ని వెబ్ సైట్లలో ఇలాంటి పోస్ట్ లకు బ్లాక్ చేసే పాలసీ ఉంది. ట్విట్టర్ వంటి కొన్ని సైట్లకు అలాంటి ఆంక్షలు ఏవీలేకపోవడంతో ఈ సంఖ్య అమాంతం పెరిగిపోతోందట. కొందరు సైకోలు కూడా ఇష్టం వచ్చినట్టు తమ నగ్న చిత్రాలు తీసి.. పోస్ట్ చేసేస్తున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: