మన చరిత్రలో ఎన్నో ప్రేమికుల గాధలు విన్నాం.. ఆ గాధల్ని చలన చిత్రాల ద్వారా కళ్లారా చూశాం. సినిమాల్లో అయితే ప్రేమించిన అమ్మాయి కోసం హీరో ఎన్ని కష్టాలైనా పడతాడు. కాని నిజజీవితంలో ప్రేమించిన అమ్మయి రూపం కాకుండా మనసును చూసి ఎంత మంది ప్రేమిస్తారు.. పెళ్లి చేసుకుంటారు. కానీ ఈ రోజుల్లో కూడా ప్రేమకు అందం ఒక్కటే కాదు మనసు కూడా అంటూ ఫేస్ బుక్ ద్వారా పరిచయం అయిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కానీ ఆ పెళ్లి వెనుక అతడి మంచి మనసు దాగి ఉంది. ఝార్ఖండ్ కు చెందిన సోనాలీ ముఖర్జీ గతంలో యాసిడ్ దాడికి గురైంది. ఆమె మోఖ అంద వికారంగా తయారైంది. అయితే ఆమెకు ఫేస్ బుక్ ద్వారా ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ చేస్తున్ చిత్తరంజన్ తివారీ అనే వ్యకితో పరిచయం ఏర్పడింది. ఆ పరిచయం ప్రేమగా మారింది.


బందువులతో సోనాలి ముఖర్జీ, చిత్తరంజన్ తివారీ


ఇద్దరు మనసులు కలిసి పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకున్నారు. యాసిడ్ దాడి బాధితురాలు సొనాలి గతంలో కౌన్ బనేగా కరోడ్ పతి లో అమితాబచన్ ని ఇంప్రెస్ చేసింది ఆయన ప్రశంసలు పొందింది. ఆమె ధైర్యాన్ని మాట తీరు చూసి చిత్తరంజన్ ఫేస్ బుక్ లో రిక్వెస్ట్ పంపించాడు. అలా ఇద్దరి మధ్య ఫేస్ బుక్ స్నేహం పెరిగి ప్రేమ వరకు వచ్చింది. అంతే కాదు వీరి వివాహా ఝార్ఖండ్ లో బొకారోలో జరిగింది. వీరి వివాహ చిత్రాలు సోనాలి తన ఫేస్ బుక్ లో పోస్ట్ చేసింది.  అతడి మంచి మనసు చూసి అందరూ ప్రశంసించారు. ప్రేమించిన వాడితో పెళ్లి అయిన సోనాలీ ముఖర్జీ ఆనందానికి అవధులు లేవు.


మరింత సమాచారం తెలుసుకోండి: