ముంబై ఇండియన్‌‌కి ఏమైంది? ఎందుకు గెలుపు ముఖం చూడలేకపోతోంది. ఈ సీజన్‌లో అతి బలమైన జట్లలో ఒక్కటిగా బరిలోకి దిగిన ముంబై నాలుగు మ్యాచ్‌లాడినా కనీసం బోణీ కొట్ట లేకపోయింది. ఖర్చుకు ఏమా్త్రం వెనుకాడని అంబానీ కుటుంబానికి చెందిన ఫ్రాంఛైజీ, ప్రధాన్‌ కోచ్‌గా పాంటింగ్‌, బౌలింగ్‌ కోచ్‌ షేన్‌ బాండ్‌, ఫీల్డింగ్‌కు జాంటీ రోడ్‌‌స, మెంటర్‌ మాస్టర్‌ బ్లాస్టర్‌, చీఫ్‌ మెంటర్‌ సీనియర్‌ మోస్‌‌ట అనిల్‌ కుంబ్లే ఇందులో ఏ ఒక్కరైనా తక్కువ తిన్న వారున్నారా..? ఇంతమంది హేమాహేమీల పర్యవేక్షణలో ఉన్న ముంబై కనీసం ఒక్క గెలుపుకోసం నానా తంటాలు పడుతోంది. ఏ స్థాయిలో ఆడిన ప్రత్యర్థిని కట్టడి చేయలేకపోతోంది. అందులో భాగంగానే శుక్రవారం నాడు చెనై్న చేతిలో మరో సారి ఓటమి చెంది. నిశ్చేష్టంగా నిలుచుంది. ముంబై : చెనై్న చెలగాటానికి ముంబై చేతులెత్తేసింది. సొంత మైదానంలో జరిగిన మ్యాచ్‌లో ఆరు వికెట్ల తేడాతో చిత్తుగా ఓడింది. సూపర్‌ ఫామ్‌లో ఉన్న చెనై్న సూపర్‌ కింగ్‌‌ను ఏ దశలోనూ నిలువరించలేకపోయిన రోహిత్‌ అండ్‌ కో చేసేది లేక మరో పరాజయాన్ని మూటగట్టుకుంది. తొలుత బ్యాటింగ్‌ చేసిన ముంబై నిర్ధేశించిన 183 పరుగుల విజయ లక్ష్యాన్ని చెనై్న అలవోకగా ఛేదించింది. ఇన్నింగ్‌‌స ఆరంభం నుంచే విధ్వంసానికి దిగిన చెనై్న ఓపెనర్లు స్మిత్‌ (62), మెకల్లమ్‌ (46) తొలి వికెట్‌కు కేవలం 7.2 ఓవర్లలో 109 పరుగులు చేసి ముంబై ఆశలపై నీళ్లు చల్లారు. ఆ తర్వాత చెనై్నని నిలువరించేందుకు విశ్వప్రయత్నం చేసిన ముంబైకి నిరాశే ఎదురైంది.

క్రీజ్‌లోకి వచ్చిన రైనా (43), డుప్లెసెస్‌ (11), బ్రావో (13) ఇలా వరుసగా పరుగుల వరద పారించి 16.4 ఓవర్లలోనే 189 పరుగులు చేసిన చెనై్న వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది.టాస్‌ గెలిచిన ముంబై ముందుగా బ్యాటింగ్‌కు దిగింది. ఆరంభంలోనే పాండ్యే విజృంభనకు చేతులెత్తేసిన పార్థీవ్‌ పటేల్‌ (0) వికెట్‌ ఇచ్చేశాడు. ఆ తర్వాత ఓ ఐదు నిమిషాల పాటు క్రీజ్‌లో నిలిచిన అండర్సన్‌ (4), ఇంకొంచెం ఎక్కువ సేపు ఆడిన సిమన్‌‌స (5) ఓవర్‌కు ఒక్కరు చొప్పున పెవీలియర్‌కు చేరడంతో 12 పరుగులకే మూడు కీలక విెట్లు కోల్పోయిన ముంబై పీకల్లోతు కష్టాల్లో పడింది. ఏం చేయాలో తోచని పరిస్థి తుల్లో తనకు తోడుగా హర్భజన్‌ని బ్యాటింగ్‌కు పిలిపించిన రోహిత్‌ కొంత సక్సెస్‌ అయ్యాడు. వీరిద్దరు కలిసి దాదాపు ఆరు ఓవర్ల పాటు బ్యాటింగ్‌ చేసి నాల్గో వికెట్‌కు 45 పరుగులు జత చేయడంతో ముంబై స్కోరు ముందుకు సాగింది. ఈ క్రమంలో భజ్జీ (24) వికెట్‌ పారేసుకోగా.. క్రీజ్‌లోకి వచ్చిన పొలా ర్‌‌డ వీర విహారం చేశాడు. 30 బంతుల్లో 4 ఫోర్లు, 5 సిక్‌‌సలతో 64 పరుగులు చేయగా.. 31 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్‌‌సతో రోహిత్‌ 50 పరుగులు చేసి ముం బైని ఆదుకున్నారు. వీరికి తోడు రాయుడు (29) పరవాలేదనిపించ డంతో వంద దాటదనుకున్న ముంబై స్కోరు 20 ఓవర్లకు 183కు చేరింది. చెనై్న వంటి జట్లకు ఇది చాలనుకున్న ముంబై సంతోషం ఇంత చేసినా నిలువలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: