జపాన్‌కు చెందిన ద్విచక్ర వాహనాల ఉత్పత్తి సంస్థ యమహా ఎంట్రిలెవల్ బైకు మార్కెట్ వాటాను పెంచుకోవడానికి సరికొత్త మోడల్‌ను నేడు లాంచ్ చేసింది. సెల్యూట్ పేరుతో విడుదల చేసిన ఈ బైకు ఢిల్లీ షోరూంలో రూ.52 వేలకు విక్రయించనున్నది. బ్లూకోర్ ఇంజిన్ టెక్నాలజీతో రూపొందించిన ఈ సెల్యూట్‌ను ఏడాదికి 60 వేల యూనిట్లు అమ్మాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు యమహా మోటార్ ఇండియా సేల్స్ వైస్ ప్రెసిడెంట్ రాయ్ కురియన్ తెలిపారు. హోండా మోటార్ సైకిల్ ఇండియాకు చెందిన షైన్, బజాజ్ డిస్కవరీ 125 ఎస్‌టీ, హీరో గ్లామర్ 125 సీసీలకు పోటీగా ఈ వాహనాన్ని ప్రవేశపెట్టింది.

రూ.1,500 కోట్ల పెట్టుబడితో చెన్నైకు సమీపంలోని కాంచీపురం వద్ద ఏర్పాటు చేసిన ఉత్పత్తి కేంద్రాన్ని వచ్చే నెలలో ప్రారంభించనున్నట్లు కురియన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఈ ప్లాంట్లో ఏడాదికి 4.50 లక్షల యూనిట్లు ఉత్పత్తవుతుండగా, 2018 నాటికి సామర్థ్యాన్ని 18 లక్షలకు పెంచుకోవాలని సంస్థ చూస్తున్నది. హర్యానాలోని ఫరీదాబాద్, ఉత్తరప్రదేశ్‌లోని సూరప్‌పూర్ వద్ద ప్లాంట్లను సంస్థ నిర్వహిస్తున్నది.


మరింత సమాచారం తెలుసుకోండి: