ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నపుడు తెలంగాణ బాగా వెనక బడిందని  ఇప్పడు మర రాష్ట్రాన్ని మనమే పాలించుకుంటున్నాం..  మరి తెలంగాణ రాష్ట్ర అభివృద్ది మన చేతుల్లోనే ఉంది అని తెలంగాణ ముఖ్యమంత్రి జిల్లా కలెక్టర్ల మీటింగ్ లో అన్నారు. తెలంగాణ అభివృధ్ది ధ్యేయంగా తెలంగాణ వ్యాప్తంగా ఉన్నప్రతి జిల్లా కలెక్టర్లు ఒక్కొక్కరికి పది కోట్ల రూపాయల నిధి ఉండేలా చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారు. హైదరాబాదులో జరిగిన జిల్లా కలెక్టర్ల వీడియో కాన్ఫరెన్స్ సమావేశం లో ముఖ్యమంత్రి ప్రతి నెలలో ఓక రోజు అర్బన్ డే గా, మరోక రోజు రూరల్ డే గా ఉండాలని సూచించారు.


ఉన్నతాధికారుల సమావేశంలో మాట్లాడుతున్న కేసీఆర్.


తెలంగాణలో కొన్ని జిల్లాలు పూర్తిగా వెనుకబడి ఉన్నాయి. వారికి పూర్తిగా సంక్షేమ ఫలాలు అందాలి. మనమీద ఎంతో నమ్మకం పెట్టి పరిపాలన భాద్యతలు మనకు అప్పజెప్పారు. మరి వారి రుణం తీర్చుకోవాల్సిన తరుణం వచ్చింది. తెలంగాణ పట్టణాల్లో వసతుల కల్పనకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఆయన కలెక్టర్లను ఆదేశించారు. అర్హులకు ఆసరా ఫించన్లు అందచేయాలని, అలాగే అనర్హులను ఏరివేయాలని ఆయన ఆదేశించారు. ప్రతి ఇంటికీ టాయిలెట్ నిర్మాణం, పరిశుభ్రంగా ఉండే గ్రామాలకు ప్రత్యేక ప్రోత్సాహక గ్రాంట్ అందజేయాలని ఆయన కోరారు. ఇందుకోసం పది కోట్ల నిధిని కలెక్టర్ల దగ్గర ఉండేలా చర్యలు చేపడతామని ఆయన చెప్పారు.


మరింత సమాచారం తెలుసుకోండి: