ఆంధ్రప్రదేశ్ సీఎం నారాచంద్రబాబు నాయుడు అద్దెంట్లోకి కాపురం పెట్టాడు. అదేంటీ ఆయనకు అద్దెఇంట్లో ఉండాల్సిన ఖర్మ అని అనుకుంటున్నారా..  అదేం  లేదండి ఈయన పాత ఇంటిని కూల్చి పూర్తి వాస్తు ప్రకారం కట్టిస్తున్నారు. అంతే కాదు ఈయన ఇంటికి ఈ మధ్య ఓ పెద్ద అథిది వచ్చారు కదా అదే ఆయన ముద్దుల మనవడు మరి ఈ చిన్నారిని చూడటానికి బంధువు తాకిడి కూడా పెరిగింది. అంతే కాదు పరిపాలన సౌలభ్యం కోసం ఇంటి నిర్మాణం పూర్తి స్థాయిలో చేపట్టాలని చూస్తున్నారట.

 
 అందుకే కొత్త అద్దె ఇంట్లోకి అడుగుపెట్టారు. జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెం. 65లో ఉంటున్న చంద్రబాబు కుటుంబం, జూబ్లిహిల్స్‌ రోడ్‌ నెం. 24లో గల ఓ అద్దె ఇంట్లోకి మారారు. ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చి దాని స్థానంలో భారీ భవంతిని నిర్మించాలని ఆయన నిర్ణయించుకున్నారు. అది పూర్తి కావడానికి దాదాపు రెండేళ్ల సమయం పడుతుందని అంచనా.
 

ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు 


చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేతలు, సందర్శకుల తాకిడి పెరగడంతో ఇళ్లు ఇరుకుగా మారిందని, దీంతో ఇప్పటి వరకు ఉన్న ఇంటిని కూల్చివేసి, ఆ స్థానంలో కొత్త భవన నిర్మాణాన్ని నిర్మించనున్నారు. అయితే ఇంటి మార్పుకు వాస్తు కూడా ఒక కారణం అయి ఉండొచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: