హీరో శివాజీ ఈ పేరు సుపరిచితమే. ఎందుకంటే మన దేశంలో రాజకీయవేత్తనైనా మర్చిపోతారేమో కానీ, సినిమా నటుడ్ని మాత్రం మర్చిపోరు. అందుకే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు ఏ రాష్ట్రంలో నైన సినిమా వాడు పాలిటిక్స్‌లో ఉండాల్సిందే. అలానే హీరో శివాజీ బిజేపి తీర్దం 2014లో పుచ్చుకున్నాడు. అప్పుడు ఏపీని విభజించిన తీరు నచ్చలేదని చెప్పాడు. కాని ఇప్పుడు బిజేపిలో అయన మల్లయుద్దం చేస్తున్నాడు. పేరుకు పార్టీలో చేరిన అయన పార్టీకి క్రీయాశీలకంగా పనిచేసింది లేదు..అలా అని పార్టీ కూడా అతనిని గుర్తించింది లేదు. కాని ఏమయిందో ఏమో బిజేపిపైనే అస్త్రం ఎక్కుపెట్టాడు. ఏపీలో వరుసపెట్టి తన వెనుక ఒకరు ఉన్నా ఇద్దరు ఉన్న కేంద్రంపై ప్రత్యేక హోదా విషయంలో విరుచుకుపడుతున్నాడు. శివాజీ ఏకంగా కేంద్రం ప్రత్యేక హోదా విషయంలో అన్యాయం చేసిందంటు బిజేపిలో ఎప్పటినుంచో జెండాలు మోసిన వారిపైనే విరుచుకుపడ్డాడు.

ఇటీవల సోము వీర్రాజుపైన ఫైర్ అవడంతో మంత్రి మాణిక్యాల రావు శివాజీపై నిప్పులు చెరిగాడు. ఇదంతా జరుగుతుంటే శివాజీ మాత్రం ఎక్కడో చోట బిజేపి కార్యకర్తను అంటూనే, నేతలపై విమర్శలు అపడంలేదు. దాంతో శివాజీ ఎవ్వారం ఏమి చేయాల అని ఏపీ బిజేపి నేతలు తలలు పట్టుకున్నారు. ఈ పరిస్తితిలో పార్టీ నుంచి సస్పెండ్ చేయడానికి అయనకి పదవి లేదు, అలా అని సైలెంట్‌గా ఉంటే పార్టీ కార్యకర్తను అంటూ శివాజీ క్లైమ్ చేసుకుంటున్నాడు. ఏమి చేయాలో తెలియక విజయవాడలో నేతలు తలలు పట్టుకొంటున్నారు. అలా అని వదిలేద్దామంటే ఇతరులతో ప్రజాసంఘాలతో కలసి సదరు హీరో చర్చలు పెడుతున్నాడు. ఈ విషయం ఏపీ అగ్రనేతల దగ్గరకు వెళ్లిన వారు సరైన సలహా ఇవ్వడం లేదు..అందుకే ఇప్పుడు ఏపీ బిజేపి నేతలకు శివాజీ కొరకరాని కొయ్య .

మరింత సమాచారం తెలుసుకోండి: