దేవాలయాల్లోని అర్చకుల పదవీవిరమణ వయోపరిమితిని 58 ఏళ్ళనుండి 65 సంవత్సరాలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు దేవాదాయ, ధర్మాదాయ శాఖ మంత్ర సి.రామచంద్రయ్య వెల్లడించారు. సచివాలయంలో బుధవారం పత్రికల వారితో మాట్లాడుతూ దేవాదియ కమిషనరేట్ ద్వారా వేతనాలు ఇప్పించాలనే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. దేవాలయాల పరిరక్షణ, అభివృద్ధ, మౌలిక సదుపాయాల కల్పనకోసం బృహత్తర ప్రణాళికనున రూపొందిస్తున్నామన్నారు. శ్రీశైలం, బాసర, వేములవాడ ఆలయాలను అభివృద్ధ పర్చాల్సి ఉందన్నారు. ప్రముఖ దేవాలయాల సమీపంలో కులసంఘాలు, మఠాలకు స్థలాలు కేటాయించే ప్రక్రియను కూడా పరిశీలిస్తామన్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: