ఎర్ర చందనం స్మగ్లింగ్.. కోట్ల రూపాయలతో కూడిన వ్యవహారం.. అడుగడుగునా పోలీసులు డేగకళ్లు.. అంతర్రాష్ట్ర పోలీసుల వలలు.. తోటి పోటీ స్మగ్లర్ల అరాచకాలు.. వీటన్నింటినీ తప్పించుకుని చందనం స్మగ్లింగ్ చేయాలంటే బోల్డు క్రిమినల్ బ్రెయిన్ ఉండాలి. 

ఏపీలోని చందనం ఇప్పటివరకూ తరలించుకుపోయిన స్మగ్లర్లు కూడా అనేక కోడ్స్ .. అంటే సీక్రెట్ నేమ్స్ పెట్టుకుని విజయవంతంగా స్మగ్లింగ్ చేశారట. పోలీసుల విచారణలో అనేక ఆశ్చర్యకరమైన విషయాలు వెలుగుచూస్తున్నాయి. శేషాచలం ఎన్ కౌంటర్ ఘటన అనంతరం ఘటనాస్థలంలో దొరికిన సెల్ ఫోన్లు, వివిధ అధారాలను విశ్లేషిస్తున్న దర్యాప్తు బృందానికి ఆశ్చర్యం కలిగించే వాస్తవాలు వెల్లడవుతున్నాయి. 

చందనం.. పేరుకు ఒకేలా కనిపించినా ఈ కలపలో చాలా గ్రేడ్లు ఉంటాయి. అందుకే.. ఒక్కో గ్రేడుకు ఒక్కో రకంగా సీక్రెట్ కోడ్ పెట్టి స్మగ్లింగ్ చేసేవారట. చందనానికి మెయిన్ గిరాకీ అంతా ఫారిన్ నుంచే ఉంటుంది. వారి ఆర్డర్లను అనుసరించి.. ఈకోడ్స్ పెట్టుకుంటారట. 

ఫైన్ క్వాలిటీ గ్రేడ్ రకానికి చాక్లెట్ అని కోడ్ పెట్టారట. సెకండ్ గ్రేడ్ క్వాలిటీ చందనానికి తబలా అని పిలుచుకునే వారట. ఇక థర్డ్ క్వాలిటీకి సిగరెట్.. ఇలా ఒక్కో క్వాలిటీకి ఒక్కో పేరు..చైనా, జపాన్, మయన్మార్ లాంటి దేశాల్లో ఈ ఎర్రచందనానికి విపరీతమైన గిరాకీ ఉందట. స్మగ్లింగ్ చేసిన చందనాన్ని నేపాల్, బర్మా మీదుగా చైనా, అటు నుంచి జపాన్ కు విమాన మార్గంలో స్మగ్లింగ్ చేస్తున్నారట. 


మరింత సమాచారం తెలుసుకోండి: