రాహుల్ గాంధీ.. 57 రోజులుగా దేశం విడిచి, రాజకీయాలను విడిచి.. దాదాపుగా సన్యాసం తీసుకున్న రేంజిలో ఎక్కడికి వెళ్లారో కూడా తెలియకుండా... సెలవు మీద వెళ్లిపోతే.. ఈ దేశంలోని ప్రజలు.. ప్రధానంగా ఆయనను వ్యతిరేకించే వాళ్లు ఎన్ని రకాల జోకులు వేసుకున్నారో అందరికీ తెలుసు. ఎన్ని రకాల విమర్శలు గుప్పించారో అందరికీ తెలుసు.. ఇలాంటి విమర్శలు, జోకులు తన కన్న కొడుకు గురించి విన్నప్పుడెల్లా.. బహుశా సోనియాగాంధీలోని తల్లి మనస్సు ఎంతగానో పరితపించిచ ఉంటుంది. కానీ సెలవు నించి తిరిగి రాగానే.. పార్లమెంటులో అడుగు పెట్టిన తరువాత... సోనియాగాంధీ.. తన కొడుకు ప్రతిభాపాటవాలను చూసి, తలచుకుని, అందరి ప్రశంసలను విని విపరీతంగా మురిసిపోయినట్లుగా కనిపిస్తోంది.


రాహుల్ గాంధీ సరిగ్గా పార్లమెంటు


రాహుల్ గాంధీ సరిగ్గా పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం అయిన రోజున సెలవు మీద వెళ్లిపోయారు. అదే బడ్జెట్ సమావేశాలు రెండో విడతగా మొదలవుతున్న రోజున ఆయన లోక్ సభలో మళ్లీ కనిపించారు. రాహుల్ సెలవు పుచ్చుకున్న రోజున అందరూ పార్లమెంటు సమావేశాలను కూడా పట్టించుకోకుండా... (లేదా ఎదుర్కొనలేకుండా) ఈ సమయంలో సెలవు తీసుకుని వెళ్లిపోతే నేత.. ఈ దేశానికి ప్రధాని కావాలని కోరుకునే స్థాయిలో ఉండడం విచారకరం అంటూ చాలా విమర్శలు గుప్పించారు. పైగా రాహుల్ తన ఆచూకీ తెలిసే అవకాశం లేకుండా వెళ్లిపోవడంతో.. రకరకాల పుకార్లు విచ్చలవిడిగా వచ్చాయి. ఇవన్నీ కూడా కాంగ్రెస్ కార్యకర్తలను బాగా ఇరుకున పెట్టినవే. ఇలాంటి పుకార్లకు ఒక దశలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు సమాధానాలు చెప్పలేక.. ఢిల్లీలో మీడియా కనిపిస్తేనే మొహం చాటేసే పరిస్థితి కూడా వచ్చింది. మొత్తానికి 56 రోజుల సస్పెన్స్ తరువాత... రాహుల్ తిరిగొచ్చారు. ఇన్నాళ్లు తానేం చేశాననే సస్పెన్స్ ను మాత్రం ఆయన అలాగే ఉంచారు.


కాంగ్రెస్ పార్టీ రైతులకు


పార్లమెంటు మళ్లీ ప్రారంభం కావడానికి ముందురోజున ఢిల్లీ ర్యాలీని ఉద్దేశించి రాహుల్ ప్రసంగించారు. భూసేకరణ చట్టాన్ని తూర్పార పట్టారు. కాంగ్రెస్ పార్టీ రైతులకు అండగా నిలబడుతుందనే భరోసా ఇచ్చారు. ఆ మరురోజు రాహుల్ పార్లమెంటులోనూ భూసేకరణ చట్టానికి వ్యతిరేకంగా మీది సూటు బూటు ప్రభుత్వం అంటూ విరుచుకుపడిన సంగతి పాఠకులకు తెలిసిందే. రాహుల్ కాస్తంత నోరు చేసుకుని మంచి ప్రసంగం చేయడంతో.. సోనియా భజన పరులకు మళ్లీ ఒక అవకాశం అందివచ్చింది. అందరూ ఆమె చుట్టూ చేరి.. రాహుల్ ప్రసంగం అదిరిపోయిందంటూ.. అనల్పంగా కీర్తించారుట.  అంతే ఆమెలోని తల్లి మనసు మురిసిపోయింది. రాహుల్ చాలా బాగా మాట్లాడాడు.. అని చాలా మంది నా దగ్గరకొచ్చి చెప్పారు... అంటూ.. చాలా మందికి చెప్పుకున్నదిట. దాంతో మిగిలిన వారు కూడా.. అవునండీ రాహుల్ గారు అదరగొట్టారు.. అంటూ తాము కూడా చిడతలు వాయించారుట.


ఈ ఎపిసోడ్ అంతా వింటోంటే... సంతోషం సినిమాలో.. కోట శ్రీనివాసరావు- బ్రహ్మానందంల మధ్య జరిగిన కామెడీ ఎపిసోడ్ గుర్తుకొస్తున్నది కదా... అవును అచ్చంగా సోనియా తల్లి మనసు వ్యవహారంలో కూడా అలాగే జరిగినట్లుంది.


మరింత సమాచారం తెలుసుకోండి: