తెలంగాణ ఉద్యమం రథసారధి అయిన కేసీఆర్ తయుడు విదేశాల్లో ఉద్యోగం చేస్తూ ఉండగా తండ్రి ఇచ్చిన ఉద్యమ స్ఫూర్తితో తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించారు. ఉద్యమం సాగే సమయంలో తెలంగాణ పోరాట పటిమ చూపించాడు. ఒక సామాన్యమైన తెలంగాణ వాదిగా అందరితో మమేకమై ముందు వెళ్లాడు. ఆయన కుటుంబంలో ఆందరూ ఉద్యమంలో ఉన్నవారే.. ఆయన కూతురు కవిత కూడా ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి తండ్రీ , అన్నలకు సహాయంగా నలిచింది. అందరూ కన్న కల నెరవేరింది తెలంగాణ ప్రత్యేక రాష్టంగా ఏర్పడింది. ఇప్పుడు వారు రాజకీయ రంగంలో అడుగు పెట్టారు. ఎంపీగా కవిత మంత్రి పదవిలో కేటీఆర్ ప్రజాసేవకు అంకితం అయ్యారు. ఇప్పడు తేరాస అధ్యక్షులుగా కేసీఆర్ మరోసారి ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా కేటీఆర్ కీలక పదవి అయిన తెలంగాణ రాష్ట్ర సమితిలో వర్కింగ్ అద్యక్ష పదవి తనకు ఇస్తానంటే సున్నితంగా తిరస్కరించారు. ప్రస్తుతం తనకు ఇలాంటివి  అవసరం లేదని ముఖ్యమంత్రి కెసిఆర్ కుమారుడు,రాష్ట్ర మంత్రి కె.తారక రామారావు అన్నారు.


తెలంగాణ ఉద్యమంలో సామాన్య కార్యకర్తగా కేటీఆర్


టిఆర్ఎస్ అద్యక్షుడుగా మరోసారి కెసిఆర్ ఎన్నికైన సందర్భంగా ఒక మీడియాతో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్య చేశారు. ఇప్పటికే కొన్ని  పత్రికలలో కెటిఆర్ వర్కింగ్ అద్యక్షుడు అవ్వవచ్చని కదనాలు కూడా వచ్చాయి. అందుకే కేటీఆర్ దానిపై వివరణ ఇచ్చినట్లు కనబడుతుంది. కెసిఆర్ అరవై ఏళ్ల వయసులో కూడా యువకుడిగా పనిచేస్తున్నారని కెటిఆర్ అన్నారు.కెసిఆర్ నాయకత్వంలో అందరం పనిచేస్తున్నామన్నారు.టిఆర్ఎస్ పార్టీని, ప్రభుత్వాన్ని కెసిఆర్ సమర్ధంగా నిర్వహిస్తున్నారని,ఆ సత్తా ఆయనకే ఉందని కెటిఆర్ పేర్కొన్నారు.కెసిఆర్ వర్కింగ్ లోనే ఉన్నారు కనుక వర్కింగ్ అద్యక్ష పదవి వంటివి అవసరం లేదని కెటిఆర్ స్పష్టం చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: