స్మార్ట్‌ఫోన్ల వాడకం పుంజుకుంటున్న నేపథ్యంలో ఉత్పత్తి సంస్థలు సరికొత్త టెక్నాలజీతో రూపొందించిన మోడళ్లను విడుదల చేయడానికి ఆసక్తి కనబరుస్తున్నాయి . ఈ ఏడాది 1,400 నుంచి 1,500 నూతన మొబైళ్లు భారత రిటైల్ మార్కెట్లో అందుబాటులోకి రానున్నట్లు పలు సర్వే సంస్థలు అంచనావేస్తున్నాయి. జియోమీ, ఆసుస్, మోటరోలా, ఒబి వంటి టెక్నాలజీ దిగ్గజాలు ప్రవేశించడమే ఇందుకు కారణం. 2014లో విడుదలైన 1,137తో పోలిస్తే 20 శాతం పెరిగి 1,500లకు చేరుకోనున్నట్లు 91మొబైల్స్.కామ్ విడుదల చేసిన నివేదికలో వెల్లడించింది. 2013లో భారత్‌లో 957 మొబైళ్లు అందుబాటులోకి వచ్చాయి. భారత్‌లో కొత్త మొబైళ్ల ట్రెండ్ కొనసాగుతున్నదని, ఇది మరింత పెరిగే అవకాశం ఉంది . చైనాకు చెందిన అగ్రస్థాయి మొబైల్ ఉత్పత్తి సంస్థలు కూడా దృష్టి సారించడం కూడా ఈ రంగంలో పోటీ మరింత తీవ్రతరమైందని కంపెనీ ప్రెసిడెంట్ మాథుర్ తెలిపారు. మూడోసారి స్మార్ట్‌ఫోన్లు కొనుగోలు చేయాలనుకునేవారు అధిక ధర కలిగిన వాటిపై దృష్టి సారిస్తున్నారని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత సంవత్సరంలో రూ.15 వేల నుంచి రూ.25 వేల లోపు విలువైన స్మార్ట్‌ఫోన్లను కొనుగోలు చేయడానికి వినియోగదారులు ఆసక్తి చూపే అవకాశం ఉందని తెలిపింది.

మరింత సమాచారం తెలుసుకోండి: