అపరిమిత భక్తకోటికి.. ఇవే నా ఆశీస్సులు.. ఆశీస్సలు...


సత్యచంద్రబాబా అను నేను


సత్యచంద్రబాబా అను నేను.. ఇవాళ్టి నుంచి నారా చంద్రబాబునాయుడు అనే తుచ్ఛమైన కుల మతాహంకారలను గుర్తు చేసేటువంటి... పేరును పరిత్యజిస్తున్నాను. పుట్టపర్తిలో ఇవాళ అడుగు పెట్టిన సుముహూర్తంలో... పవిత్రమైన భగవాన్ సత్యసాయి బాబా వారి పవిత్రాత్మ నాతో పలికిస్తున్న మాటలివి. సత్యసాయి బాబా ఉన్నప్పుడు పుట్టపర్తికి ఎలాంటి వైభవ స్థితి ఉన్నదో... ఇప్పుడు కూడా నా పాలనలో అటువంటి వైభవ స్థితి ని తీసుకువస్తానని ఘంటాపథంగా చెబుతున్నాను. సత్యసాయి బాబా మరణించి సమాధి అయిన తరువాత.. ఆయన జీవించి ఉన్ననాటి వైభవం ఎలా రాగలుగుతుందని మీకు సందేహం ఉండవచ్చు. ఇక్కడ పుట్టపర్తిలో సమాధి కాకుండా.. జీవించి ఉన్న బాబా ఉంటే తప్ప... ఆ వైభవ స్థితి రాదనే సంగతి నాకు కూడా తెలుసు. అయినా.. ఇంత పెద్ద బాబా సీట్లో నమ్మి ఎవ్వరినీ కూర్చోబెట్టగలిగిన రోజులు కావివి.  నేను రాజకీయాల్లో తర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ కాబట్టి నాకు లోతుపాతులు చాలా బాగా తెలుసు. ఇక్కడ ఒకసారి నమ్మి మన సీట్లో మరొకరిని కూర్చోబెట్టాం అంటే.. ఇక అంతే దాని మీద పర్మినెంటుగా ఆశలు వదులుకోవాల్సిందే. మనమీద ఎవ్వరికీ భక్తి ఉండదు. భయం మాత్రమే ఉంటుంది. ఆ భయాన్ని మనం క్యాష్ చేసుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో భయం వలన కలిగే భక్తి మాత్రమే మెండుగా కనిపించే ప్రజలను ఆకట్టుకోడానికి ఇక్కడ సత్యసాయిబాబా ఉన్నప్పటి వైభవం కోసం బాధ్యతను నమ్మి ఎవ్వరికీ అప్పగించలేం. నేను నా నీడను కూడా నమ్మే రకం కాదని మీకందరికీ తెలుసు కదా. అందుకే నేను ఇక మీదట రాష్ట్రంలో డ్యుయల్ రోల్ అనగా అదేనండీ.. మన బాలయ్య బావ రాబోయే లయన్ సినిమాలో పోషించాడు కదా.. అలాంటిది పోషించాలని అనుకున్నాను.. ఇదంతా.. మన రాష్ట్ర ప్రగతి కోసమే సుమండీ. అందులో ఒకటి ఈ ‘సత్యచంద్ర బాబా’.


నేను జనం గురించి ఓ సింపుల్ టెక్నిక్ కనుక్కొన్నాను


అక్కడ సీఎం కుర్చీలో మాయమాటలు చెప్పే సర్వాధికారాలు మనకే దఖలు పరిచినారు కదా జనం. అందుకే మనం చెలరేగిపోతున్నాం. అప్పుడెప్పుడో అరచేతిలో వైకుంఠం చూపించడం అంటూ సరదాగా చెబుతుండేవారు... అలాంటి వారిని నమ్మకూడదని పెద్దలంటారు. నేను వైకుంఠం రూపంలో ఒక్కటేమిటి ఖర్మ.. నేను గట్లు తెంచేసిన భూముల్లో సింగపూర్, మలేషియా, చైనా, జపాన్... ఇలా అనేకానేక దేశాలను చూపించేస్తున్నప్పటికీ.. జనం కిమ్మనకుండా... చూస్తున్నారంటే.. నేనెంత గొప్ప మాయగాడినైఉంటానో మీరు అర్థం చేసుకోవాలి. నేను జనం గురించి ఓ సింపుల్ టెక్నిక్ కనుక్కొన్నాను. ఆశపడే జనానికి వారికి ఆశకు మించినది చేస్తామని చెప్పేస్తే చాలు.. వాస్తవంగా అవుతుందా లేదా అనే తార్కికత జోలికి వెళ్లకుండా వారు మన మాటలు నమ్మి ఎదురుచూస్తూనే ఉంటారు. ఈలోగా మన పబ్బం గడచిపోతుంది. ఇక్కడ కూడా పుట్టపర్తిలో మన రెండో అవతారంలోనూ అంతే. ఇక్కడ భక్తి పేరుతో వేలం వెర్రిగా మన దగ్గరకు జనం వచ్చేస్తుంటారు. మనం ఎంచక్కా... మన మార్కు గడ్డంతో వెరైటీ నవ్యబాబాగా ఒక గుర్తింపు గడిస్తాం. వారి కోరికలు తీరడానిక విభూతి ప్రసాదిస్తాం. పనులు పూర్తయిన వారు... మన మహిమ అనుకుంటారు. పనులు చెడిన వాళ్లు తమ ఖర్మం అనుకుంటారు. ఎవ్వరూ మన రెండో రూపంలోని ప్రభుత్వాల్ని మాత్రం నిందించరు. అలా మనం ఇక్కడ భక్తకోటిని నమ్మించగల బాబా అవతారంలో కుదురుకున్నాం అంటే...  మన టేలెంట్ ముందు చిన్నసన్న బాబాలు నిలవలేరు. ఒక్కదెబ్బలో అందరినీ ఊది పారేయగలం. అందుకే ఈ డ్యుయల్ రోల్ కూడా వేయాలని అనుకుంటున్నా.


అయినా.. మన దేశంలో.. జనానికి నమ్మకం చాలా ఎక్కువ


అయినా.. మన దేశంలో.. జనానికి నమ్మకం చాలా ఎక్కువ. జనానికి ఉండేదంతా ఇతరుల ప్రతిభ మీద ఏర్పడిన నమ్మకం కాకపోవడం మన అద్రుష్టం. వారి ఆశ కొద్దీ.. మాయ మాటల మీద నమ్మకం. వారి అత్యాశ కొద్దీ బాబాలు మరియు వారి మాయల మీదే నమ్మకం. వారి తొలి నమ్మకం అలాంటి డొల్ల కాబట్టే.. మనం ఇవాళ ఏలుబడిలోకి వచ్చేశాం... ఏలుకుంటున్నాం. వారి రెండో నమ్మకం మీద కూడా మన బిజినెస్ మొదలెట్టేశాం అనుకోండి.. ఇక రెండు చేతులా కుమ్మేయొచ్చు ఏమంటారు....????


మరింత సమాచారం తెలుసుకోండి: