వైసీపీ.. రాయలసీమలోనే ఈ పార్టీకి బాగా పట్టుందని చెప్పుకుంటారు. ప్రకాశం,నెల్లూరు జిల్లాల్లోనూ ఓకే.. కానీ మిగిలిన కోస్తాలో గత ఎన్నికల్లో చెప్పుకోదగ్గ ఫలితాలు సాధించలేదు. విశాఖలో ఏకంగా పార్టీ గౌరవాధ్యక్షురాలే ఎన్నికల్లో ఓడిపోయిన సంగతి తెలిసిందే. 

అందుకే ఇటీవల వైసీపీ వైజాగ్ పై దృష్టిసారించింది. తన పార్టీపై ఉన్న చెడ్డపేరు తొలగేలా చర్యలు తీసుకుంటోంది. జగన్ సన్నిహితుడు విజయసాయిరెడ్డి ప్రత్యేకించి ఇదే పనిపై ఉన్నారు. గ్రేటర్ విశాఖ ఎన్నికల కోసం ఆయన వ్యూహాలు రచిస్తున్నారు. 


పార్టీ క్యాడర్ లో ఉత్సాహం నింపేందుకు విజయసాయి ప్రయత్నిస్తున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గ్రేటర్ విశాఖ ఎన్నికల్లో విజయదుందుభి మోగించడం ఖాయమని ఆయన నమ్మకంగా చెబుతున్నారు.  గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ ఎన్నికలు నిర్వహించడానికి ప్రభుత్వం వెనుకంజ వేస్తోందని.. విజయసాయిరెడ్డి అన్నారు. ఎన్నికలు నిర్వహిస్తే.. గ్రేటర్ విశాఖ కార్పోరేషన్ పీఠాన్ని తాము కైవసం చేసుకుంటామన్నారు. 


విజయసాయిరెడ్డి, చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి గురువారం విశాఖలో గ్రేటర్ విశాఖ పరిధిలోని వైఎస్సార్ కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షులు, పార్టీ శ్రేణులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ విశాఖ ఎన్నికల్లో పార్టీని గెలిపించి విజయమ్మకు కానుకగా ఇద్దామని చెప్పారు. పోలవరం ప్రాజెక్టును ఆపేయడానికే.. పట్టిసీమను ముందుకు తీసుకొచ్చారని చెవిరెడ్డి భాస్కరరెడ్డి ఆరోపించారు. రాయలసీమలో పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేయకుండా..పట్టిసీమ ద్వారా ఆదా చేసే.. 80టింఎం.సీల నీటిని .. ఎలా తీసుకొస్తారని.. ఆ ప్రాంతానికి ఎలా ఇస్తారని ప్రశ్నించారు. 


మరింత సమాచారం తెలుసుకోండి: