తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయిన తర్వాత తెలంగాణ రాష్ట్రంలో టీడీపీ ప్రాబల్యం పూర్తిగా పడిపోతుందని సంకేతాలు వస్తున్నాయి. గతంలో చంద్రబాబుకు కనుసన్నల్లో మెదిలే నాయకులంతా ఇప్పడు రివర్స్ అయ్యారు. తెలంగాణలో టీఆర్ఎస్ ప్రాబల్యం పెరిగిపోయింది. ముఖ్యంగా అధికార పార్టీ టీఆర్ఎస్ కావడంతో అందరూ టీఆర్ఎస్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ , టీడీపీ నుంచి చాలా మంది వలస వచ్చారు. తాజాగా మహేశ్వరం ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి, ఇబ్రహింపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి లు కూడా టీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడానికి సిద్ధం అయ్యారు.


తండ్రి దేవేందర్ గౌడ్ తో వీరేంద్ర గౌడ్


దీంతో తెలుగుదేశంలో నుంచి టిఆర్ఎస్ లో చేరిన ఎమ్మెల్యేల ఇళ్ల వద్ద ఆందోళనలకు టిడిపి నిర్వహించింది.  టిఆర్ఎస్ ప్లీనరీ నేపధ్యంలో టిడిపి ఈ విషయంలో ఆందోళనలు చేపట్టడం ద్వారా టిఆర్ఎస్ ను ఇరుకున పెట్టడానికి టిడిపి వ్యూహ రచన చేసింది.  ఇళ్ల ముందు నిరసనలు చేపట్టడానికి సిద్దమైన టిడిపి నేత, రాజ్యసభ సభ్యుడు దేవేందర్ గౌడ్ కుమారుడు వీరేంద్ర గౌడ్ ను పోలీసులు అరెస్టు చేశారు. సరూర్ నగర్ వద్దే ఈయనను అదుపులోకి తీసుకున్నారు.పరకాల ఎమ్మెల్యే దర్మారెడ్డి ఇంటి ముందు వరంగల్ లో కూడా టిడిపి ఆందోళన చేసింది.

 


మరింత సమాచారం తెలుసుకోండి: