ఇక్కడ మాత్రం కొడుకు పేరు సోమలింగం సంగతి కాదు. అదేతీరుగా, సవాళ్లు ప్రతిసవాళ్లు దొర్లిపోతున్నాయి. అసలు జరుగుతుంతో లేదో తెలియని ఒక నియోజకవర్గ ఎన్నిక గురించి.. నాయకులు మాత్రం.. ఎవరు రాజీనామాలు చేయాలి? ఎవరు రాజకీయ సన్యాసం చేయాలి? అంటూ సవాళ్లు, ప్రతిసవాళ్లు విసురుకుంటూ ఉండడం ఆసక్తికరం. ఇదంతా తెలంగాణ రాజధాని హైదరాబాదు నగరంలో ఉన్న సనత్‌ నగర్‌ నియోజకవర్గ పరిస్థితి. 


శ్రీనివాస యాదవ్‌ మీద తెలంగాణ తెదేపా నాయకులకు పీకల్దాకా కోపం


ఇక్కడ తెదేపా తరఫున గెలిచిన ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస యాదవ్‌ మీద తెలంగాణ తెదేపా నాయకులకు పీకల్దాకా కోపం ఉన్న మాట వాస్తవం. తామంతా ఇప్పటికీ ప్రతిపక్షంలోనే కునారిల్లుతోంటే.. నిన్నటిదాకా తమ సహచరుడు ఇవాళ మంత్రి పదవి వెలగబెడుతుండడం వారికి జీర్ణం కాకపోవచ్చు. అందుకే కాబోలు.. పార్టీని మోసం చేసి వెళ్లాడంటూ.. తలసాని మీద వారందరూ తీవ్రస్థాయిలో ఆరోపణలు గుప్పిస్తుంటారు. తాజాగా ఎర్రబెల్లి వెర్సస్‌ తలసాని మధ్య కూడా ఇదే వివాదం రాజుకుంది. దమ్ముంటే తలసాని సనత్‌ నగర్‌ నుంచి మళ్లీ గెలవాలని, అక్కడ ప్రజలు ఆయన మోసాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ ఓడిస్తారని ఎర్రబెల్లి సవాలు విసిరారు. తలసాని కూడా అదేస్థాయిలో ప్రతిసవాళ్లు విసిరారు. తాను సనత్‌నగర్‌లో ఓడిపోతే రాజకీయ సన్యాసం చేస్తానని.. అదే సమయంలో.. తాను గెలిస్తే ఎర్రబెల్లి కూడా రాజకీయ సన్యాసానికి సిద్ధమేనా? అని ఆయన అంటున్నారు. 


ఇక్కడ తమాషా ఏంటంటే.. తెరాస పార్టీలోని విశ్వసనీయ వర్గాలనుంచి తెలుస్తున్న సమాచారాన్ని బట్టి.. అసలు సనత్‌నగర్‌ కు ఉప ఎన్నిక నిర్వహించే అవకాశమే లేదు. తాను తెదేపా తరఫున గెలిచిన నేత గనుక.. తెరాసలో చేరి మంత్రిపదవి పుచ్చుకునే ముందు టెక్నికల్‌ ఇబ్బంది రాకుండా తలసాని శ్రీనివాసయాదవ్‌ స్పీకరుకు రాజీనామా సమర్పించారు. అయితే ఇప్పటిదాకా ఆయన దానిని ఆమోదించలేదు. ఇకమీదట కూడా ఆమోదించే అవకాశమూ లేదని అంతా అనుకుంటున్నారు. ఆ రకంగా అసలు సమీప భవిష్యత్తులో సనత్‌నగర్‌ ఉప ఎన్నిక అంటూ ఉండకపోవచ్చు. అసలు జరిగే అవకాశమే లేని ఒక ఎన్నిక కోసం ఇద్దరు సీనియర్‌ నాయకులు రాజకీయ సన్యాసం వరకు సవాళ్లు` ప్రతిసవాళ్లు విసురుకోవడం చూస్తోంటే.. కామెడీ అనిపిస్తోంది. 


మరింత సమాచారం తెలుసుకోండి: