సామాజిక సేవా కార్యక్రమాల్లో సినీ తారలు పాల్గొనడం సహజం. కానీ ఇవి రెగ్యులర్ గా మాత్రం కాదు ఎప్పుడో  ప్రకృతి విపత్తు సంభవించినపుడు మాత్రమే మేల్కొంటారు. సమాజ సేవా అంటే అప్పుడప్పుడు వచ్చి చేసేది కాదు ప్రతి నిత్యం ప్రజలతో మమేకం అవుతూ వారి బాధల్ని పంచుకుంటూ సొసైటీలో ఏం జరుగుతుంది దాని పరిష్కారం మార్గాలు ఏంటీ అని వారికి చేదోడు వాదోడు గా ఉండటం. ఆ మధ్య స్వఛ్ భారత్ అంటూ ఓ కార్యక్రమం వచ్చింది. దీనికోసం సెలబ్రెటీలు అంతా చీపుర్లు పట్లుకొని అపరిశుభ్రంగా ఉన్న ప్రదేశాలు శుభ్రం చేసి సోషల్ మీడియాలో హల్ చల్ చేశారు. తర్వాత దాని ఊసే మరిచారు కనీసం నెలలో రెండు సార్లైనా జనాల మధ్యకు వచ్చి ఇలాంటి కార్యక్రమాలు చేపడితే ప్రజల్లో నూతనోత్తేజం వస్తుంది.


రక్తదానం చేస్తున్న వారిని అప్యాయంగా పలుకరిస్తున్న పవన్ కళ్యాన్


పవన్ కళ్యాన్ సినిమా ఇండస్ట్రీలో మంచి పేరు సంపాదించుకొని రాజకీయ రంగం వైపు మళ్లారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ ప్రజలతో మమేకం అవుతున్నారు. ఆ మధ్య ఓ పాపకు ఆరోగ్యం బాగా లేనపుడు ఆమెను కలిసి  ఓదార్పు తో పాటు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఆమె కోలుకోవడంలో   వంతు పాత్ర పోషించిన సంగతి తెలిసిందే. అయితే శ్రీజ కోలుకుంది కుటుంబ సమేతంగా పవన్ కళ్యాన్ ని కలిసి కృతజ్ఞతలు తెలిపింది. సమాజ సేవ కోసం తాను స్దాపించిన కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్సు ద్వారా మరింత మందికి ఓదార్పు ఇవ్వాలని అభిమానులు, ప్రజలు కోరుకుంటున్నారు. లేదా బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ స్థాపించిన బీయింగ్ హ్యూమన్ సంస్థకు ప్రచార కర్తగా ఉన్నా బాగుంటుంది అభిప్రాయ పడుతున్నారు. కాగా బాలీవుడ్ నటుడు ఫర్హాన్ అక్తర్ స్దాపించిన మ్యాన్ ఎగైనెస్ట్ రేప్ అండ్ డిస్క్రిమినేషన్ కు ప్రిన్స్ మహేష్ బాబు ప్రచార కర్తగా ఉన్నారు. మరి పవన్ మంచి మనసు చేసుకొని సమాజ సేవకు తన వంతు కృషిగా ముందుకు అడుగు వేస్తారా చూడాలి..!  


మరింత సమాచారం తెలుసుకోండి: